మీరు వ్యాక్సిన్‌ వేయించుకున్నారా..! అయితే ఈ ఆఫర్‌ మీకోసమే..!

2 Feb, 2022 13:35 IST|Sakshi

కోవిడ్‌-19ను ఎదుర్కొవాలంటే వ్యాక్సినేషన్‌ కచ్చితమని ఇప్పటికే నిపుణులు, డాక్లర్లు వెల్లడించిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు పలు మల్టీనేషన్‌ కంపెనీలు వినూత్న ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎయిర్‌లైన్‌ సంస్థ ఇండిగో విమాన  ప్రయాణికుల కోసం సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. 

టికెట్‌పై 10 శాతం రాయితీ..! 
కరోనా వ్యాక్సిన్‌ ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులకు విమాన టికెట్లపై 10శాతం వరకు రాయితీ అందిస్తామని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. అందుకోసం ‘వాక్సి ఫేర్‌’ అనే కొత్త ఆఫర్‌ను విమాన ప్రయాణికులకోసం తీసుకువచ్చింది. ఈ ఆఫర్‌పై కొన్ని షరతులు  ఇండిగో ప్రకటించింది. విమాన ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకునే సమయానికి భారత్‌లో ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. కేవలం ఇండిగో వెబ్‌సైట్‌లో బుకింగ్‌ చేసుకునేవారికే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. టికెట్లను బుక్‌ చేసుకున్న తేదీ నుంచి 15 రోజుల తర్వాత మాత్రమే ఈ డిస్కౌంట్‌ రానుంది. అయితే ప్రయాణించే సమయంలో ఎయిర్‌పోర్ట్‌ చెక్‌ ఇన్‌లో కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ను కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. 


బుకింగ్‌ ఇలా చేయండి..!

  • ముందుగా ఇండిగో ఆఫిషియల్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి
  • తరువాత మీరు ప్రయాణించే గమ్యస్థానాన్ని ఎంచుకునే సమయంలో వ్యాక్సి ఫేర్‌ను ఎంచుకోండి.  
  • మొదటి డోసు లేదా రెండో డోసు ఆప్షన్‌ను సెలక్ట్‌ చేయండి. 
  • ఈ ఆప్షన్‌ తరువాత పేమెంట్‌ చేసిన వెంటనే టికెట్‌ బుక్‌ ఐనట్లు మీకు నోటిఫికేషన్‌ వస్తోంది.
  • అయితే ఇక్కడ టికెట్‌ బుక్‌ చేసే సమయంలో కచ్చితంగా మీ వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 


చదవండి: విమాన ప్రయాణమంటే ఎయిర్‌ ఇండియానే గుర్తు రావాలి - రతన్‌ టాటా

మరిన్ని వార్తలు