ఒకేసారి అన్ని విమానాలు కొంటుందా? ఇండిగో భారీ డీల్‌..

4 Mar, 2023 12:25 IST|Sakshi

దేశీయ దిగ్గజ ఏవియేషన్‌ సంస్థలు భారీ ఎత్తున విమానాల కొనుగోళ్లకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఎయిరిండియా కోసం టాటా సన్స్‌ 500 విమానాల్ని కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. తాజాగా ఇండిగో సైతం బోయింగ్‌, ఎయిర్‌ బస్‌ సంస్థల 500 అంతకంటే ఎక్కువ విమానాల కోసం ఆర్డర్‌ ఇవ్వనున‍్నట్లు రాయిటర్స్‌ కథనం పేర్కొంది. ప్రస్తుతం విమానాల కొనుగోళ్ల నేపథ్యంలో విమానాల తయారీ సంస్థలతో ఇండిగో చర్చలు జరుపుతుందని, ఆ చర్చలు సఫలమైతే ఎయిరిండియా తర్వాత మరో అతిపెద్ద ఒప్పొందం అవుతుందని రాయిటర్స్‌ తెలిపింది. 

బడ్జెట్‌ విమానయాన సంస్థ ఇండిగో గత నెలలో న్యారో బాడీ ప్లైట్ల కోసం ఎయిర్‌ బస్‌, ఫ్రెంచ్‌ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయని, ఆ చర్చలు కొలిక్కి రావడంతో వందల విమానాల కొనుగోలుకు సిద్ధపడినట్లు రాయిటర్స్‌ రిపోర్ట్‌ హైలెట్‌ చేసింది. ఇక మరో పదేళ్లలో ఇండిగో సంస్థ మిడ్‌ సైజ్‌ వైడ్‌ బాడీ జెట్స్‌ విమానాల సంఖ్యను పెంచే ప్రణాళికల్లో ఉండగా అందుకు అనుగుణంగా విమానాల ఆర్డర్‌ ఉండనుంది  

ఇప్పటికే ఎయిరిండియా
ఎయిరిండియా బ్రాండ్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చేందుకు మాతృ సంస్థ టాటా సన్స్‌ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్ని అందుకునేలా 100 బిలియన్‌ డాలర్లతో 500 విమానాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఒప్పందంలో భాగంగా విమాన తయారీ సంస్థలు ఈ 500 ఎయిర్‌ క్రాప్ట్‌లను 8 ఏళ్లలో డెలివరీ చేయనున్నట్లు రాయిటర్స్‌ కథనం వెలువరించింది.  

మరిన్ని వార్తలు