కస్టమర్‌ కోరిన చోటుకే లగేజీ డెలివరీ...!

3 Apr, 2021 08:04 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  విమానయాన సంస్థ ఇండిగో.. డోర్‌ టు డోర్‌ బ్యాగేజ్‌ డెలివరీ సేవలను ప్రారంభించింది. ప్రయాణికుల లగేజీని ఇంటి నుంచి విమానాశ్రయానికి, అలాగే విమానాశ్రయం నుంచి కస్టమర్‌ కోరిన చోటకు చేరుస్తారు. 6ఈబ్యాగ్‌పోర్ట్‌ పేరుతో ఈ సేవలను కార్టర్‌పోర్టర్‌ అనే కంపెనీ సహాయంతో ఢిల్లీ, హైదరాబాద్‌లో ఇండిగో అందుబాటులోకి తెచ్చింది. ముంబై, బెంగళూరుకూ ఈ సేవలను విస్తరించనున్నారు.

ఒకవైపుకు చార్జీ రూ.630తో మొదలు. కస్టమర్‌కు చెందిన లగేజీని పూర్తిగా ట్రాక్‌ చేస్తారు. విమానం బయల్దేరడానికి 24 గంటల ముందు బుక్‌ చేయాల్సి ఉంటుంది. విమానం దిగిన ప్రయాణికులకు వెంటనే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరుకు చెందిన కార్టర్‌పోర్టర్‌ ఆన్‌ డిమాండ్‌ బ్యాగేజ్‌ డెలివరీ సేవలను విస్తారా, ఎయిర్‌ ఏషియాకు సైతం అందిస్తోంది.

చదవండి: కర్నూలు ‘ఉయ్యాలవాడ’ ఎయిర్‌పోర్టులో ప్రారంభమైన విమానాల రాకపోకలు

మరిన్ని వార్తలు