ఇండిగో ఎయిర్‌లైన్స్ పరిమిత ఆఫర్‌.. కేవలం రూ. 2218లకే విమాన ప్రయాణం!

4 Dec, 2022 18:31 IST|Sakshi

దేశీయ విమానాల్లో ప్రయాణించే వారికి శుభవార్త చెప్పింది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఏయిర్‌ లైన్స్‌. ప్యాసింజర్లను ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్‌ని తీసుకొచ్చింది. కేవలం రూ. 2218 (వన్ వే ఛార్జీ) ప్రారంభ ధరతో విమానంలో ప్రయాణించడానికి గొప్ప ఆఫర్‌తో ప్రయాణికులకు అందించనుంది. ఇండిగో సంస్థ ప్రకటించిన ఈ వింటర్ సేల్ ఆఫర్ డిసెంబర్ 1న ప్రారంభం కాగా డిసెంబర్ 6 తో ముగుస్తుంది.

ఈ మధ్య కాలంలో టికెట్స్‌ను బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. దేశంలో ఏ ప్రదేశానికైనా త్వరలో మీరు వెళ్లాలనుకుంటే ఈ 6 రోజుల్లో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుకింగ్ విండో ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉండగా, డిసెంబర్‌ 6 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ప్రకారం జనవరి 10 నుంచి ఏప్రిల్ 13 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. 

ఇది పరిమిత సీట్లకు మాత్రమే. ఈ ఆఫర్‌లో విమానాశ్రయ ఛార్జీలు, ప్రభుత్వ పన్నులపై తగ్గింపు వర్తించదు. మరో విషయం ఏంటంటే ఇండిగో దేశీయ నెట్‌వర్క్‌లోని వివిధ రంగాలలో నాన్‌స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. గ్రూప్ బుకింగ్‌లపై ఈ ఆఫర్ వర్తించదు. ఈ ఆఫర్‌ను బదిలీ చేయడం, నగదుగా మార్చడం వంటివి సాధ్యం కాదు. ఇండిగో అందించే ఈ ఆఫర్ పూర్తిగా బెస్ట్ ఎఫర్ట్ ప్రాతిపదికన అందిస్తోంది. పరిస్థితుల బట్టి ముందస్తు నోటీసు లేకుండా, కారణం చెప్పకుండా ఈ ఆఫర్‌ను ఎప్పుడైనా రద్దు చేసే లేదా సవరించే హక్కును ఇండిగో సంస్థకు ఉంది. 
 

చదవండి: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ!

మరిన్ని వార్తలు