ఇండ్‌సోమ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రారంభం

30 Sep, 2020 17:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భార‌త్‌-సొమాలియా దేశాల మ‌ధ్య వాణిజ్య సంబంధాల‌ను బలోపేతం చేసే దిశ‌లో ఇండ్‌సోమ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అనే సంస్థను ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయ‌త్ హోట‌ల్‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఇండ్‌సోమ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అనే సంస్థ ప్రభుత్వేతర, లాభాపేక్షలేని సంస్థ. ఇది భారతదేశం, సోమాలియాకు చెందిన వ్యాపారవేత్తలచే స్థాపించబడింది. ఇరు దేశాల మ‌ధ్య వాణిజ్య సంబంధాల‌ను ప్రోత్సహించడానికి దీనిని ప్రారంభించారు. భారతదేశం, సోమాలియా, ఎగుమతి దిగుమతి కార్యకలాపాలు (బిలియన్ డాలర్లకు దగ్గరగా), సాంకేతిక మార్పిడి, జాయింట్ వెంచర్లకు ఇవి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి.

సోమాలియా, భారతదేశం మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఇటీవలి సంవత్సరాలలో సంవత్సరానికి యూఎస్‌ $ 600 మిలియన్లు, భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. రాబోయే పది నుంచి పదిహేను సంవత్సరాల్లో మొదటి మూడు ఆర్థిక శక్తులలో భార‌త్ నిల‌వ‌నుంది. సోమాలియా ప్ర‌స్తుతం ఆర్థిక పునరుద్ధరణ దిశ‌గా వెళుతోంది. పెట్రోలియం, మత్స్య సంపద త‌దిత‌ర సహజ వనరులు ఇక్క‌డ పుష్క‌లంగా ఉన్నాయి. వీటిపైనే ఇప్పుడు ప్ర‌ధానంగా ఆయా దేశం దృష్టిసారిస్తుంది. అయితే వ్యవసాయం, పశుసంపద అవ‌స‌రాల‌కు అనువైన తయారీకి చాలా అధునాతన ఉత్పత్తి కార్యకలాపాలు, దేశీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ దేశానికి భారీ పెట్టుబడులు అవసరం.

ఈ వేదిక ద్వారా రెండు దేశాలలో వ్యాపారాభివృద్ది సాధ్య‌మ‌వుతుంద‌ని ఇండ్సమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ల‌య‌న్ వై. కిరోణ్‌ చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల ముక్య కార్య‌ద‌ర్శి జ‌యేష్ ‌రంజ‌న్ ముఖ్య అతిధిగా మాట్లాడుతూ.. ఇండ్‌సోమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు రాష్ట్ర మద్దతు ఉంటుంద‌న్నారు. ఇది ఇరు దేశాల మ‌ధ్య వ్యాపార‌, వాణిజ్యాన్ని పెంచ‌డమే కాకుండా దేశాల ఆర్థిక ప్ర‌గ‌తికి, సత్సంబంధాల‌కు, సాంకేతిక మార్పిడికి దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా