ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేవారికి గుడ్‌ న్యూస్‌! ఈ బ్యాంకులో వడ్డీరేట్లు పెరిగాయ్‌..

19 Mar, 2023 16:11 IST|Sakshi

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేవారికి ప్రైవేట్ రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం... ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన మొత్తంపై సాధారణ ప్రజలకు 3.5 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంది.

ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్‌ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్‌ ఇవే.. 

ఒకటిన్నర సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మూడు నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్‌పై అత్యధిక వడ్డీ సాధారణ ప్రజలకు 7.75 శాతం, అదే సీనియర్ సిటిజన్‌లకైతే 8.25 శాతం ఉంటుంది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. పెరిగిన వడ్డీరేట్లు మార్చి 18 నుంచి అమలులోకి వస్తాయి.

వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇలా..
7 నుంచి 30 రోజుల వ్యవధి డిపాజిట్లపై 3.5 శాతం, 31 నుంచి 45 రోజుల వ్యవధి డిపాజిట్లపై 4 శాతం, 46 నుంచి 60 రోజుల వ్యవధి డిపాజిట్‌లకు 4.5 శాతం, 61 నుంచి 90 రోజుల వ్యవధి డిపాజిట్‌లకు 4.60 శాతం వడ్డీ ఉంటుంది.

ఇదీ చదవండి: Byju’s: మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్‌ బయటపెట్టిన బైజూస్‌ రవీంద్రన్‌!

91 నుంచి 120 రోజుల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 4.75 శాతం, 121 నుంచి 180 రోజుల వ్యవధి డిపాజిట్లపై 5 శాతం, 181 నుంచి 210 రోజులలో మెచ్యూర్ అయ్యే దేశీయ టర్మ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తుంది. అలాగే 211 నుంచి 269 రోజుల వ్యవధి డిపాజిట్లపై 5.80 శాతం, 270 నుంచి 354 రోజుల వ్యవధి డిపాజిట్లపై 6 శాతం, 355 నుంచి 364 రోజుల వ్యవధితో చేసిన డిపాజిట్లపై 6.25 శాతం అందిస్తుంది.

ఇదీ చదవండి: ఆ విషయంలో షావోమీ రికార్డ్‌ను బ్రేక్‌ చేయనున్న ఐఫోన్‌!

>
మరిన్ని వార్తలు