పారిశ్రామిక రంగానికి ‘సెప్టెంబర్‌’ ఊరట

12 Nov, 2022 04:09 IST|Sakshi

ఐఐపీ 3.1 శాతం వృద్ధి

తయారీ, మైనింగ్, విద్యుత్‌ చేయూత  

న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం సెప్టెంబర్‌లో కొంత సానుకూల ఫలితాన్ని సాధించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సమీక్షా నెల్లో 3.1 శాతం (2021 ఇదే నెలతో పోల్చి) పెరిగింది. తయారీ, మైనింగ్, విద్యుత్‌ రంగాలు సెప్టెంబర్‌లో మంచి ఫలితాలను అందించినట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పే ర్కొంది. ఆగస్టులో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 0.7% క్షీణతను నమోదుచేసుకుంది. జూలై లో వృద్ధి కేవలం 2.2%. అయితే 2021 సెప్టెంబర్‌లో పారిశ్రామిక వృద్ధి 4.4 శాతంకన్నా, తాజా వృద్ధి రేటు తక్కువగానే ఉండడం గమనార్హం.  

► తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు దాదాపు 70 శాతం వెయిటేజ్‌ కలిగిన తయారీ రంగం సమీక్షా నెల్లో 1.8 శాతం పురోగమించింది. 2021 ఇదే నెల్లో వృద్ధి 4.3 శాతం.  
► విద్యుత్‌: ఈ రంగం వృద్ధి రేటు 11.6%గా ఉంది. 2021 ఇదే నెల్లో ఈ రేటు కేవలం 0.9%.  
► మైనింగ్‌: వృద్ధి 8.6% నుంచి 4.6%కి తగ్గింది.  
► క్యాపిటల్‌ గూడ్స్‌: ఉత్పత్తి 10.3 శాతం పెరిగింది. 2021 ఇదే నెల్లో ఈ రేటు 3.3 శాతం.  
► కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: 4.5% క్షీణించింది. గతేడాది ఈ నెల్లో  1.6% వృద్ధి జరిగింది.  

ఆరు నెలల్లో 7 శాతం పురోగతి
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2022–23, ఏప్రిల్‌–సెప్టెంబర్‌) ఐఐపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది.

మరిన్ని వార్తలు