ఆన్‌లైన్‌ గేమింగ్‌కు ఎస్‌ఆర్‌వో ఏర్పాటు చేస్తాం

31 Dec, 2022 05:59 IST|Sakshi

ఐఏఎంఏఐ వెల్లడి

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌పై పర్యవేక్షణకు సంబంధించి స్వీయ నియంత్రణ సంస్థను (ఎస్‌ఆర్‌వో) ఏర్పాటు చేసేందుకు పరిశ్రమ సమాఖ్య ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఐఏఎంఏఐ ముందుకొచ్చింది. ఇందుకు అవసరమైన సామరŠాధ్యలు, అనుభవం తమకు ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. నైపుణ్యాల ఆధారిత పలు ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలకు ఐఏఎంఏఐలో సభ్యత్వం ఉండటం కూడా ఇందుకు తోడ్పడగలదని పేర్కొంది.

ఇప్పటికే కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్దేశించినట్లుగా ఆన్‌లైన్‌ క్యూరేటెడ్‌ కంటెంట్‌ కంపెనీస్‌ మొదలైన వాటికి సంబంధించిన ఎస్‌ఆర్‌వోలను నిర్వహిస్తున్నామని తెలిపింది. సమాజంపై ప్రభావం చూపే ఆన్‌లైన్‌ గేమింగ్‌పై కేంద్రం తగు విధానాలు లేదా కొత్త చట్టం తీసుకువస్తుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో ఐఏఎంఏఐ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. 

మరిన్ని వార్తలు