రూపాయికే బ్లూటూత్..!! దేశీయ మార్కెట్‌లో అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో మ‌రో 5జీ ఫోన్!

17 Feb, 2022 07:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియ‌న్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో 5జీ స్మార్ట్ ఫోన్‌ల హ‌వా కొన‌సాగుతుంది. ఈ నేప‌థ్యంలో ఇన్ఫినిక్స్‌ తొలి 5జీ ఫోన్‌ను ‘జీరో 5జీ’ పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసింది.
 
ఫీచ‌ర్లు, ధ‌ర‌లు 

మీడియాటెక్‌ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఇది పనిచేస్తుంది.

13 5జీ బ్యాండ్లకు సపోర్ట్‌ చేస్తుంది.

అత్యధిక 5జీ బ్యాండ్లు కలిగిన ఫోన్‌ ఇదే 

8జీబీ ర్యామ్‌ (5జీ ర్యామ్‌ ఎక్స్‌పాండబుల్‌), 128జీబీతో వచ్చే దీని ధర రూ.19,999.

ఫ్లిప్‌కార్ట్‌పై ఈ నెల 18 నుంచి విక్రయాలు మొదలు కానున్నాయి. 

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.999 విలువ చేసే ఇన్ఫినిక్స్‌ స్నాకర్‌ (ఐరాకర్‌)ను కేవలం రూ.1కే అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.

ఆండ్రాయిడ్‌ తాజా వెర్షన్‌ 11పై పనిచేస్తుంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సదుపాయంతో ఉంటుంది.  

మరిన్ని వార్తలు