భారీ ఆఫర్‌: దూసుకుపోయిన ఇన్ఫోసిస్‌

12 Apr, 2021 14:29 IST|Sakshi

 సాక్షి, ముంబై: 1800 పాయింట్లుకు పైగా కుప్పకూలిన దలాల్ స్ట్రీట్‌లో ఈ సోమవారం బ్లాక్‌ మండేగా నిలిచింది. స్టాక్‌మార్కెట్లో  2021లో ఇదే అదిపెద్ద పతనం. అయితే  దేశంలోని రెండవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం లాభాలతో మురిపించింది.  తమ బోర్డు సమావేశంలో వాటాలను తిరిగి కొనుగోలు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తుందని  ఆదివారం ఎక్స్ఛేంజీలకు సమాచారం కంపెనీ వెల్లడించడమే ఇందుకు కారణం. దీంతో ఇన్ఫోసిస్  షేరు  ఏకంగా  2.72 శాతం  ఎగిసి  రూ.1480 తాకింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది.  ఫలితంగా ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ బీఎస్‌ఇలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి  6.12 లక్షల కోట్లను తాకింది. అనంతరం లాభాల స్వీకరణ కారణంగా స్వల్పంగా నష్టపోతోంది.  (మార్కెట్ల క్రాష్‌: రూ. 7 లక్షల కోట్లు మటాష్‌)

ఏప్రిల్ 14, 2021న బోర్డు సమావేశం ముగిసిన తరువాతఇన్ఫోసిస్‌ భారీ బైబ్యాక్‌ ప్రకటించనుందన్న అంచనాలు ఇన్వెస్టర్లను  కొనుగోళ్లవైపు మళ్లించాయి. ప్రధానంగా క్యూ4 ఫలితాలు, బోర్డ్ మీటింగ్‌లో ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకోనుందని అంచనా. దీనికితోడు ఫైనల్ డివిడెండ్ కూడా కంపెనీ ప్రకటించనుందని సీఎల్ఎస్ఏ అంచనాలు  వెలువరించింది. దాదాపు ఒకటి నుంచి ఒకటిన్నరశాతం ఈక్విటీకి సమానమైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి ఇన్ఫోసిస్ తిరిగి కొనుగోలు చేయనుందనితెలిపింది. ఈ  బైబ్యాక్‌ను డైరెక్టర్ల బోర్డు ఆమోదించినట్లయితే,రెండేళ్ళలో ఇన్ఫోసిస్ రెండో బై బ్యాక్‌ ఆఫర్ అవుతుంది. మార్చి 2019న 747  ధర వద్ద  11.05 కోట్ల ఇన్ఫోసిస్  షేర్లను  8,260 కోట్లకు  కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (బంపర్‌ ఆఫర్‌ : ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర భారీ తగ్గింపు)

చదవండి :  ఇల్లు కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా...అయితే మీకో శుభవార్త!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు