కూతురితో నారాయణ మూర్తి - ఫన్ మిస్ అయిన రిషి సునాక్!

13 Feb, 2024 13:16 IST|Sakshi

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు 'నారాయణ మూర్తి' ఇటీవల తన కుమార్తె 'అక్షతా మూర్తి'తో కలిసి బెంగళూరులోని ఒక ఐస్‌క్రీమ్ పార్లర్‌లో సాధారణ వ్యక్తుల మాదిరిగానే ఐస్‌క్రీమ్ తింటూ కనిపించారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఓ వైపు బ్రిటన్ ప్రథమ మహిళ, మరో వైపు టెక్ దిగ్గజం ఇద్దరూ చాలా సింపుల్‌గా కనిపించిన ఫోటో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  ఈ ఫోటోను ఒక ఎక్స్ (ట్విటర్) యూజర్ షేర్ చేస్తూ.. బెంగళూరులోని జయనగర్ 5వ బ్లాక్‌లోని 'కార్నర్ హౌస్‌'లో బ్రిటన్ ప్రథమ మహిళ అక్షతా మూర్తి తన తండ్రి నారాయణమూర్తితో కలిసి ప్రశాంతంగా ఐస్‌క్రీమ్ తింటున్నారు. ధనవంతులైనప్పటికీ సాధారణ వ్యక్తులు మాదిరిగా జీవితం గడుపుతున్నారు. ఇదే నారాయణమూర్తి గొప్పతనం అంటూ ట్వీట్ చేశారు.

ఈ ఫొటోలో నారాయణ మూర్తి, అక్షతా మూర్తి ఇద్దరూ క్యాజువల్‌ దుస్తులు ధరించి ఉండటం చూడవచ్చు. ఇందులో రిషి సునాక్ పేరు కూడా ట్యాగ్ చేసి మీరు ఈ ఫన్ మిస్ అయ్యారు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసి పలువురు నెటిజన్లు వీరి సింప్లిసిటీకి ఫిదా అయిపోతున్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

whatsapp channel

మరిన్ని వార్తలు