ఇన్ఫోసిస్‌ ప్రెసిడెంట్‌ రవి కుమార్‌ ఎస్‌ రాజీనామా

12 Oct, 2022 07:18 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ ప్రెసిడెంట్‌ రవి కుమార్‌ ఎస్‌ రాజీనామా చేశారు. అయితే, ఇందుకు గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇన్ఫోసిస్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ ఆర్గనైజేషన్‌ విభాగానికి ఆయన సారథ్యం వహించారు. బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో న్యూక్లియర్‌ సైంటిస్టుగా కెరియర్‌ ప్రారంభించిన రవి కుమార్‌ 2002లో ఇన్ఫీలో చేరారు. 2016లో ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2017లో డిప్యుటీ సీవోవోగా నియమితులైన రవి .. ఆ తర్వాత సీవోవోగా పదోన్నతి పొందుతారనే అంచనాలు ఉండేవి. అయితే, అప్పటి సీవోవో యూబీ ప్రవీణ్‌ రావు రిటైర్మెంట్‌ తర్వాత ఇన్ఫీ ఆ పోస్టునే తీసివేసింది.  

మరిన్ని వార్తలు