రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌...ఇన్ఫోసిస్‌ సంచలన నిర్ణయం..!

3 Apr, 2022 18:23 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పటీ నుంచి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ప్రపంచ దేశాలపై భారీ ప్రభావం చూపుతోంది. ఇరు​ దేశాల మధ్య యుద్దం మొదలైనప్పటినుంచి యుద్ధ ప్రభావం నేరుగా వంటనూనె, క్రూడాయిల్‌ ధరలపై పడింది. ఇదే సామాన్యుల పాలిట శాపంలా మారింది. ఒక్కసారిగా ఇంధన, వంటనూనె ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్య ప్రజలు తీవ్రంగా సతమతమవుతున్నారు. కాగా ప్రస్తుతం ఉక్రెయిన్‌ రష్యా వార్‌ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను కూడా వదిలిపెట్టలేదు.  
రష్యాలో  బంద్‌..!
గ్లోబలైజేషన్‌లో భాగంగా ఇన్ఫోసిస్‌ పలు దేశాలకు విస్తరించింది. రష్యాలో కూడా కంపెనీ తన సేవలను అందిస్తోంది. రష్యా ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో...ఇన్ఫోసిస్ రష్యాలోని తన కార్యకలాపాలను మూసివేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. బ్రిటిష్‌ మీడియా బీబీసీ నివేదిక ప్రకారం...రష్యాలోని ఇన్ఫోసిస్‌ కార్యకలాపాలను ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తి చూసుకుంటోంది. అక్షతా మూర్తి భర్త రిషి సునక్‌. వీరు యూకే ఛాన్స్‌లర్‌ ఆఫ్‌ ఎక్స్‌ చెకర్‌, ఫైనాన్స్‌ మినిష్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా రష్యాలోని ఇన్ఫోసిస్‌ కార్యకలాపాలను అక్షతా మూర్తి నిర్వహిస్తోడడంతో రిషి సునక్‌కు చిక్కులు తెచ్చిపెట్టాయి.

యూకే ఆర్థిక మంత్రి ఇంట్లోని వారు రష్యాతో వ్యాపారాలు చేయడం ఎంత వరకూ సబబు అంటూ బ్రిటన్‌ మీడియా రిషిపై ప్రశ్నల వర్షం కురిపించింది.  అంతేకాకుండా రష్యన్‌ బ్యాంక్‌ ఆల్ఫా బ్యాంక్‌తో ఇన్ఫోసిస్‌కు సంబంధాలున్నాయంటూ, పుతిన్‌కు లాభం చేకూరేలా వారి కుటుంబ చర్యలు ఉన్నాయంటూ రిషి సునక్‌ను బ్రిటిష్‌ మీడియా ఎత్తి చూపింది. దీంతో రిషి సునక్‌ కుటుంబంపై వస్తోన్న ఆరోపణలకు సమాధానంగా రష్యాలోని తమ కార్యకలాపాలను మూసివేసేందుకు ఇన్ఫోసిస్‌ సిద్దమైనట్లు తెలుస్తోంది.  

ఉక్రెయిన్‌పై రష్యా ప్రకటించిన సైనిక చర్యను ఇన్ఫోసిస్‌ ముందుగానే తోసిపుచ్చింది. రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో తాము శాంతికి మద్దతు ఇస్తామని ఇన్ఫోసిస్‌ గతంలోనే ఒక ప్రకటనలో తెలియజేసింది. 

చదవండి: కళ్లుచెదిరే లాభం.. కేవలం 5 నెలల్లో ఒక లక్షకు రూ. 85 లక్షల జాక్‌పాట్‌ కొట్టేశారు..!

>
మరిన్ని వార్తలు