‘దివాలా’ కంపెనీల నిబంధనలకు సవరణలు

20 Sep, 2022 11:28 IST|Sakshi

న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చట్టం కింద వేలానికి వచ్చే కంపెనీలకు, మెరుగైన విలువ రాబట్టే విధంగా సంబంధిత నిబంధనలను దివాలా బోర్డు (ఐబీబీఐ) సవరించింది. అవసరమైతే కంపెనీని విడగొట్టి విక్రయించేందుకు అనుమతించింది. మొత్తం వ్యాపారం కొనుగోలు కోసం తగిన పరిష్కార ప్రతిపాదనేది రాని పక్షంలో రుణగ్రహీతకు సంబంధించిన అసెట్లను విడివిడిగా విక్రయించడానికి, మరోసారి రిజల్యూషన్‌ ప్రణాళికలు సమర్పించాలని కోరుతూ రుణదాతల కమిటీ ప్రకటన చేయొచ్చని ఐబీబీఐ పేర్కొంది.

ఒకవేళ మిగతా అన్ని మార్గాలూ విఫలమైతే ఆఖరు ప్రయత్నంగా ప్రమోటరుతో సెటిల్మెంట్‌ చేసుకునేందుకు కూడా కొత్త నిబంధనలతో వెసులుబాటు లభిస్తుంది. ఇకపై వేలంలో పాల్గొనేలా మరింత మంది బిడ్డర్లను ఆకర్షించేందుకు రిజల్యూషన్‌ ప్రొఫెషనల్, రుణదాతలు ప్రత్యేకంగా రోడ్‌షోలు కూడా నిర్వహించవచ్చు.

చదవండి: లక్కీ బాయ్‌.. 5 నిమిషాల వీడియో పంపి, రూ.38 లక్షల రివార్డ్‌ అందుకున్నాడు!

>
మరిన్ని వార్తలు