టిక్‌టాక్ తో ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త చిక్కులు

15 Feb, 2021 15:42 IST|Sakshi

గత ఏడాది జూన్ 29న పొరుగు దేశం చైనాతో ఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం టిక్‌టాక్ ను దేశంలో నిషేదించిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి టిక్‌టాక్ కు ప్రత్యామ్నాయంగా చాలా యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, తక్కువ సంఖ్యలో మాత్రమే యాప్ లు ప్రజాధారణ పొందాయి. వాటిలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ కొత్తగా తీసుకొచ్చిన "రీల్స్" చాలా ఫేమస్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌కు ఒక టిక్‌టాక్ తో పెద్ద తలనొప్పి ఎదురైంది. గతంలో టిక్‌టాక్‌ యూజర్లు రూపొందించిన వీడియోలు ప్రస్తుతం రీల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. 

దీనితో చాలా మంది టిక్‌టాక్ వినియోగదారులు తమ పాత వీడియోలను తిరిగి రీల్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలపై టిక్‌టాక్ వాటర్ మార్క్ ఉండటంతో ఎక్కువ కంటెంట్ కాపీ పేస్ట్ అవుతుందని
ఇన్‌స్టాగ్రామ్‌ ఆలోచిస్తుంది. ఇకపై టిక్‌టాక్ యాప్‌లో రూపొందించిన వీడియోలను ‘రీల్స్‘లో అప్‌లోడ్ చేయకుండా ఉండటానికి కొత్త సాంకేతికతను రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ సాంకేతిక సహాయంతో కాపీ 
కంటెంట్ ను పోస్టు చేయలేరని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

చదవండి:

బిగ్ బ్యాటరీతో విడుదలైన గెలాక్సీ ఎఫ్ 62

‘ఆపిల్ డే సేల్’లో ఐఫోన్లపై భారీ తగ్గింపు

మరిన్ని వార్తలు