Facebook Messenger And Instagram: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా డౌన్‌..! ట్విట్టర్‌లో యూజర్ల అరాచకం..!

4 Nov, 2021 11:53 IST|Sakshi

ఫేస్‌బుక్‌ మరోసారి స్తంభించిపోయింది.భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఫేస్‌బుక్‌,ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు బుధవారం అర్ధరాత్రి వరల్డ్‌ వైడ్‌గా పనిచేయడం ఆగిపోయాయి. దీంతో నెటిజన్లు మరోసారి ఆగ్రహానికి గురయ్యారు. ఫేస్‌బుక్‌కు చెందిన సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లను వదిలేసి ట్విట్టర్‌ను వినియోగిస్తామంటూ ట్వీట్‌ చేస్తున్నారు. మీమ్స్‌ వేస్తున్నారు. ప్రస్తుతం ఆ మీమ్స్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండగా అవి మీకోసం. 

(చదవండి: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్‌బుక్‌ డిలీట్‌ అంటూ కవర్‌ పేజీ)

'డౌన్ డిటెక్టర్' రిపోర్ట్‌ ప్రకారం..భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12:1 నిమిషాల సమయంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, వాట్సాప్‌,ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ సర్వీసులు కొన్ని గంటల పాటు ఆగినట్లు తెలిపింది. దీంతో అసహనానికి గురైన భారత్‌తో పాటు యూఎస్‌,యూకే దేశాలకు చెందిన యూజర్లు ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.  

ఇక ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్ట్రాగ్రామ్‌ సర్వీసులు ఆగిపోవడంపై #facebookdown, #instagramdown అనే హ్యాష్‌ ట్యాగ్‌లు నెట్టింట్లో ట్రెండ్‌ అవుతున్నాయి. అయితే దీనిపై "ఫేస్‌బుక్‌ ఈఎంఈఏ కమ్యూనికేషన్‌ మేనేజర్‌ అలెగ్జాండ్రూ వాయిస్కా స్పందించారు. మెసేజింగ్‌ యాప్స్‌ పనిచేయడం లేదని ఫిర్యాదులు అందాయి. బగ్‌ను గుర్తించి త్వరలోనే సేవల్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు. మెసేజింగ్‌ సర్వీసులు నిలిచిపోయినందుకు క్షమించండి అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌ అఫిషియల్‌ అకౌంట్‌ నుంచి బుధవారం అర్ధరాత్రి 1.33గంటలకు మెసేజ్‌ చేశారు. ఆ తరువాత మరోసారి తెల్లవారు జామున 4.34 గంటల ప్రాంతంలో వీఆర్‌ బ్యాక్‌. బగ్‌ను గుర్తించి, సమస్యను పరిష్కరించామంటూ" మెసేజ్‌ చేశారు.  

కాగా, గత అక్టోబర్‌ నెలలో వరుసగా రెండు సార్లు, బుధవారం అర్ధరాత్రి (నవంబర్‌ 3) ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు నిలిచిపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమదైన స్టైల్లో ఫేస్‌బుక్‌ తీరును విమర్శిస్తున్నారు. 

మరిన్ని వార్తలు