ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌! మీమ్స్‌ వైరల్‌!

6 Jul, 2022 13:46 IST|Sakshi

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్‌ తగిలింది. ఆ సంస్థకు అనుసందానంగా ఉన్న సోషల్‌ మీడియా నెట్‌ వర్క్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్లు షట్‌ డౌన్‌ అయినట్లు తెలుస్తోంది.స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపిన మెసేజ్‌లు ఆటోమెటిగ్గా డిలీట్‌ అవుతున్నట్లు నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నట్లు సోషల్‌ మీడియా సమస్యల్ని గుర్తించే డౌన్‌ డిటెక్టర్‌.ఇన్‌ తెలిపింది. 

డౌన్‌ డిటెక్టర్‌ సంస్థ మంగళవారం రాత్రి 8 గంటలకు ఫిర్యాదులు మొదలయ్యాయని  తెలిపింది. బుధవారం 11.25గంటల సమయానికి  మొత్తం 985 మంది నెటిజన్లు ఫిర్యాదు చేశారని పేర్కొంది.

అందులో 52శాతం యూజర్లు యాప్‌లో సమస్యలు తలెత్తుతున్నాయని, 39శాతం మందికి సర్వర్ సమస్యలు, 9శాతం మందికి లాగిన్‌ సమస్యలు ఎదురయ్యానని ఫిర్యాదు  చేసినట్లు డౌన్‌ డిటెక్టర్‌ ప్రతినిధులు తెలిపారు. 

ఈ తరుణంలో మెటాకు చెందిన ఫ్లాట్‌ ఫాంలపై అసహనం వ్యక్తం చేసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీమ్స్‌ను షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు