మరో ఫీచర్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌

25 Jun, 2021 12:33 IST|Sakshi

వినియోగదారులకు అనుగుణంగా సోషల్‌ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు స‍్మార్ట్‌ ఫోన్లకే పరిమితమైన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ఇప్పుడు డెస్క్‌ టాప్‌పై దర్శనమివ్వబోతున్నాయి."మాకు తెలుసు వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌ తో పాటు డెస్క్‌టాప్‌లో రీల్స్‌ను షేర్‌ చేయాలని చూస‍్తున్నారు. వారి కోసమే డెస్క్‌టాప్‌ ఫీచర్‌ను అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస‍్తున్నాం. రీల్స్‌ను రికార్డ్‌ చేసి.. డెస్క్‌ టాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయోచ్చు"అని ఇన్‌స్టాగ్రామ్‌ స్పోక్‌ పర్సన్‌ అధికారికంగా ప్రకటించారు. 

రీల్స్‌ను ఎలా అప్‌లోడ్‌ చేయాలి. 

ఇన్‌స్టాగ్రామ్‌ ను మీకంప్యూటర్‌లో, లేదంటే ల్యాప్‌ట్యాప్‌ లో ఓపెన్‌ చేయాలి. ఓపెన్‌ చేసిన తరువాత ఇన్‌ స్టాగ్రామ్‌ ఇంటర్‌ ఫేస్‌లో ప్లస్‌ సింబల్‌ను క్లిక్‌ చేయాలి

క్లిక్‌ చేసి సెలక్ట్‌ ఫ్రమ్‌ కంప్యూటర్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలి. 

అనంతరం మీకు కావాల్సిన ఒరిజనల్‌ స్కైర్‌,ల్యాండ్‌ స్కేప్‌, పోట్రేట్‌ సైజ్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. 

సెలక్ట్‌ చేసుకున్న అనంతరం క్లిక్‌ నెక్ట్స్‌ అనే ఆప్షన్‌ పై ట్యాప్‌ చేయాలి. 

అలా ట్యాప్‌ చేస్తే ఫిల్టర్‌, ఎడిట్‌ బ్రైట్‌ నెస్‌, కాంట్రాస్ట్‌ ఆప్షన్‌లు మనకు కనిపిస్తాయి. 

అనంతరం మీ వీడియోలకు, ఫోటోలకు క్యాప్షన్‌ రాసి, లోకేషన్‌ యాడ్‌ చేయాలి. ఆ తరువాత వీడియోని షేర్‌ చేసుకునే సదుపాయాన్ని ఇన్‌ స్టాగ్రామ్‌ కల్పించింది.  

చదవండిరేజర్‌పేతో ట్విటర్‌ జట్టు

మరిన్ని వార్తలు