పిల్లల ఇ(న్‌)ష్టాలపై.. పేరెంట్స్‌కి గైడెన్స్‌...

1 Aug, 2021 16:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఇన్‌స్టాగ్రామ్‌ యువతకు అత్యంత వేగంగా చేరువవుతోంది. సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు తదితర విశేషాల కోసం మాత్రమే కాకుండా స్వయంగా తాము కూడా విభిన్న రకాల కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేస్తూ ఇన్‌స్టా కు ఫ్యాన్స్‌గా మారిపోతున్నారు యూత్‌. ఈ నేపధ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన యువతను దృష్టిలో ఉంచుకుని లక్షల సంఖ్యలో ఉన్న యువ వినియోగదారుల కంటెంట్‌ భద్రత దృష్ట్యా... ఇన్‌స్టాగ్రామ్‌ పేరెంట్స్‌ గైడ్‌ను రూపొందించింది. దీనిని హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఓ ఆన్‌లైన్‌ సదస్సులో విడుదల చేసింది. 

ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ అందిస్తున్న అన్ని రకాల సేఫ్టీ ఫీచర్స్‌ గురించి తమ యువ వినియోగదారుల తల్లిదండ్రులకు తెలియజెప్పడమే ఈ పేరెంట్స్‌ గైడ్‌ రూపకల్పన ఉద్ధేశ్యమని రూపకర్తలు వివరించారు. మారుతున్న డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ గురించి అవగాహన కూడా ఇది అందిస్తుందన్నారు. టీనేజర్ల భధ్రత, హక్కులకు సంబంధించి పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రిసెర్చ్, సైబర్‌ పీస్‌ ఫౌండేషన్, ఆరంభ్‌ ఇండియా ఇనీషియేటివ్, యంగ్‌ లీడర్స్‌ ఫర్‌ యాక్టివిటీ సిటిజన్‌ షిప్‌., ఇట్స్‌ ఓకె టూ టాక్, సూసైడ్‌ ప్రివెన్షన్‌ ఇండియా ఫౌండేషన్‌.. వంటి సంస్థలు అందించిన విశేషాలు, వివరాలు ఈ గైడ్‌ లో పొందుపరచామన్నారు. అంతేకాకుండా ఈ గైడ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ అందిస్తున్న డిఎమ్‌ రీచబులిటీ కంట్రోల్స్, బల్క్‌ కామెంట్‌ మేనేజ్‌మెంట్‌ వంటివాటి గురించి సమగ్రంగా వివరించామన్నారు. 

అవగాహన అవసరం..
తెలుగు రాష్ట్రాలకు చెందిన టీనేజర్లు, యువత ఆన్‌లైన్‌లో అత్యధిక సమయం వెచ్చిస్తున్న పరిస్థితుల్లో... వారు వినియోగిస్తున్న ఉత్పత్తులు, ఫీచర్ల గురించి తల్లిదండ్రులకు తెలిసి ఉండడం అత్యంత అవసరం. దీని వల్ల తమ పిల్లల సృజనాత్మక శైలి గురించి కూడా తెలుసుకోగలుగుతారు. అలాగే వారికి అందుబాటులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్‌ గురించి కూడా అవగాహన పెంచుకుంటారు. 
–తారాబేడీ, ఇన్‌స్టాగ్రామ్‌

మరిన్ని వార్తలు