Instagram Subscription: యూజర్లకు షాక్‌: ఉచితం లేదు..డబ్బులు చెల్లించాల్సిందే..!

9 Nov, 2021 19:29 IST|Sakshi

Instagram Subscription:  ఇన్‌ స్టాగ్రామ్‌ యూజర్లకు షాక్‌. ఇప్పటి వరకు ఇన్‌స్టాలో క్రియేటర్లు అందించే కంటెంట్‌ను ఉచితంగా వీక్షించాం. కానీ ఇకపై ఆ సౌకర్యం లేదు. ఇన్‌ స్టాగ్రామ్‌  అందించే ఎక్స్‌ క్లూజివ్‌ కంటెంట్‌ను వీక్షించాలంటే కొంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. 

ఇండియాలో నెంబర్‌ వన్‌ 
స్టాటిస్టా ఏప్రిల్‌ 2021 లెక్కల ప్రకారం..ఫోటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ 180 మిలియన్ల మంది యూజర్లతో భారత్‌లో అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో 170 మిలియన్లు, బ్రెజిల్‌లో 110 మిలియన్లు, ఇండోనేషియాలో 93 మిలియన్‌ యూజర్లు ఉన్నారు. అయితే  భారత్‌లో ఇన్‌ స్టాగ్రామ్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఆ సంస్థ హెడ్ ఆడమ్ మోస్సేరి సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. 

ఇన్‌ స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఎంత చెల్లించాలంటే 

ఇకపై ఎక్స్‌ క్లూజివ్‌ క్రియేటర్లు, ఇన్‌ స్టాగ్రామ్‌  ఇన్​ఫ్లూయన్సర్లు, ప్రముఖులకు  సంబంధించిన కంటెంట్‌ను వీక్షించాలంటే భారత్‌లో నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ రూ.89 నుంచి రూ.449వరకు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ప్రీమియం ఆప్షన్‌పై జూన్‌లో జరిగిన క్రియేటర్ వీక్‌లో ఇన్‌స్టాగ్రామ్ హెడ్ మాట్లాడుతూ..క్రియేటర్‌లు మూడు రకాలుగా ఎలా  మనీ ఎర్న్‌ చేయొచ్చనే విషయంపై చర్చించారు. అదే సమయంలో ఇన్‌ స్టాగ్రామ్‌లో తెచ్చే సబ్‌స్క్రిప్షన్ మోడల్ క్రియేటర్‌లు,ఇన్​ఫ్లూయన్సర్లు, ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్ అందించే వారికి అదనంగా మనీ ఎర్న్‌ చేసుకునే సదుపాయం ఉండనుందని తెలిపారు.  

అధికారంగా ప్రకటించలేదు
ప్రస్తుతం ఈ సబ్‌ స్క్రిప్షన్‌ మోడల్‌పై ఇన్‌ స్టాగ్రామ్‌ ఎటాంటి ప్రకటన చేయలేదు. అయితే వెలుగులోకి వస్తున్న తాజా రిపోర్ట్‌ల ప్రకారం..అమెరికా యూజర్లు నెల వారి సబ్‌స్క్రిప్షన్‌ $0.99 నుండి $4.99 వరకు, భారత యూజర్లు రూ.89 నుంచి రూ.449వరకు చెల్లించాల్సి ఉంటుంది.  

టిక్‌ టాక్‌ బ్యాన్‌ దెబ్బకు 
చైనా షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌ టాక్‌ బ్యాన్‌తో భారత్‌లో ఇన్‌ స్టాగ్రామ్‌ను వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఇన్‌ స్టాగ్రామ్‌ హెడ్ ఆడమ్ మోస్సేరి కొత్త కంటెంట్‌ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు సబ్‌స‍్క్రిప్షన్‌ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామంటూ గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ సబ్‌స్కిప్షన్‌ ఆప్షన్‌ ఎనేబుల్‌ చేసినట్లు టెక్‌ క్రంచ్‌ ఆధారలతో సహా రిపోర్ట్‌ను విడుదల చేసింది.  

చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు

మరిన్ని వార్తలు