ఇన్‌ స్టాగ్రామ్‌,ఈ సూప‌ర్‌ ఫీచర్‌ గురించి మీకు తెలుసా?!

22 Jul, 2021 13:52 IST|Sakshi

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ ఇన్‌ స్టాగ్రామ్‌ మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ సాయంతో సెన్సిటీవ్‌ కంటెంట్‌ ను కంట్రోల్‌ చేయవచ్చని ఇన్‌ స్టాగ్రామ్‌ ప్రతినిధులు వెల్లడించారు.

ప్రతిరోజు ప్రపంచ వ్యప్తంగా 500మిలియన్ల మంది యాక్టీవ్‌ యూజర్లు ఇన్‌ స్టాగ్రామ్‌లో గడుపుతున్నారు. అయితే వారిలో  కొంతమంది యూజర్లు అశ్లీల ఫోటోలు, మెసేజ్‌లను షేర్‌ చేస్తున్నారు. దీన‍్ని అరికట్టేందుకు సెన్సిటీవ్‌ కంటెంట్‌ కంట్రోల్‌  ఫీచర్‌ను అప్‌ డేట్‌ చేసింది. ఈ ఫీచర్‌ ను వినియోగించడం ద్వారా అశ్లీల కంటెంట్‌ రాకుండా అడ్డుకోవచ్చు. ఇన్‌స్టా గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకంగా అశ్లీల కంటెంట్‌ అప్‌లోడ్‌ చేస్తే వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌ ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో తొలగిస్తామని ఇన్‌ స్టాగ్రామ్‌  వెల్లడించింది. 

ఈ ఆప్షన్‌ను ఎలా ఎనేబుల్‌ చేసుకోవాలి

ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ ను క్లిక్‌ చేయాలి

క్లిక్‌ చేసి ప్రొఫైల్‌ సెంట‍్టింగ్‌ లో మెన్యు ఆప్షన్‌ మీద ట్యాప్‌ చేయాలి

మెన్యు ఆప్షన్‌ మీద క్లిక్‌ చేస్తే మీకు సెన్సిటీవ్‌ కంటెంట్‌ కంట్రోల్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. 

ఆ ఆప్షన్‌ క్లిక్‌ చేసిన వెంటనే మీకు లిమిట్‌, అలో, లిమిట్‌ ఈవెన్‌ మరో అనే ఆప‍్షన్‌ డిస్‌ప్లే అవుతోంది

 లిమిట్‌ ఈవెన్‌ మరో అనే ఆప‍్షన్‌ క్లిక్‌ చేస్తే మీకు అశ్లీల్‌ కంటెంట్‌ మీ ప్రొఫైల్‌ లో షేర్‌ అవ్వడం ఆగిపోతుంది. 

  చదవండి : ల్యాప్‌ ట్యాప్‌ కొనాలనుకుంటున్నారా, అయితే ఈ బ్రాండ్‌ బాగుంటుందంట

మరిన్ని వార్తలు