ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌

21 Oct, 2021 14:19 IST|Sakshi

ఇన్‌స్టాగ్రామ్‌ తన కోట్లాది మంది యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై పీసీలోనూ యాప్‌ను యధేచ్చగా ఉపయోగించుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. వెబ్‌ వెర్షన్‌ ద్వారా ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేసే అవకాశం కల్పించింది. 


తొలుత ‘ఎన్‌గాడ్జెట్‌’లో కనిపించిన ఈ ఫీచర్‌.. ఇప్పుడు ఈ ఫీచర్‌ ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది.  ఈ ఫీచర్‌ ద్వారా పర్సనల్‌ కంప్యూటర్‌లలో ఎడిట్‌ చేసుకున్న ఫొటోల్ని, హైలీ ప్రాసెస్డ్‌ ఇమేజ్‌లను సైతం అప్‌లోడ్‌ చేయొచ్చు. ఇంతకు ముందు కంప్యూటర్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌కు పంపించుకున్నాకే ఫొటోల్ని అప్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉండేదని తెలుసు కదా. ఇక మీదట ఆ అవసరం లేదు.

కాకపోతే ఫీడ్‌ ఎక్స్‌ప్లోర్‌ కోసం, ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌లను, మిగతా సమాచారాన్ని యాక్సెస్‌ చేసుకునే వీలుమాత్రం ఉండేది. ఇంతకాలం ఫోన్‌ ఆధారిత యాప్‌గా ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌.. ఇప్పుడు కంప్యూటర్‌ ఆధారితం కూడా కావడంతో యూజర్లకు మరింత సులువుతరం కానుంది. అంతేకాదు యూజర్ల సంఖ్య మరింత పెరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ఫేస్‌బుక్‌.

చదవండి: పేరు మార్చుకోనున్న ఫేస్‌బుక్‌? కారణాలు ఏంటంటే..

మరిన్ని వార్తలు