ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు కొత్త బెడద..! వారికి మాత్రం పండగే...

20 Jun, 2021 17:26 IST|Sakshi

భారత్‌లో టిక్‌టాక్‌ బ్యాన్‌ను అదనుగా తీసుకున్న ఫేస్‌బుక్‌ తన వినియోగదారుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో​ రీల్స్‌ను తెచ్చిన విషయం తెలిసిందే. చాలా మంది నెటిజన్లు ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ వీడియోల్లో మునిగితేలుతున్నారు. కాగా ప్రస్తుతం ఫేస్‌బుక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ మధ్యలో  30 సెకన్ల పాటు యాడ్స్‌ రానున్నాయి.

జూన్‌ 18 నుంచి ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ యూజర‍్లకు అందుబాటులోకి వచ్చింది. దీంతో రీల్స్‌ చూస్తోన్న యూజర్లకు కాస్త చికాకును కల్పించనుంది  కాగా ఇన్‌స్టాగ్రామ్ ఏప్రిల్‌లోనే  భారత్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్, జర్మనీల్లో తొలిసారిగా యాడ్‌ రీల్స్‌ను పరీక్షించింది. ఇది విజయవంతం కావటంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సదుపాయాన్ని లాంచ్‌ చేసింది. యూజర్లకు కొత్త కంటెంట్‌ను కనుగొనడానికి, క్రియేట్‌ చేయడానికి రీల్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇన్‌స్టాగ్రామ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జస్టీన్‌ ఓసోఫ్స్కీ తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఈ నిర్ణయంతో కంటెంట్‌ క్రియేటర్లకు మాత్రం పండగే..! ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ మధ్యలో వచ్చే యాడ్స్‌తో కంటెంట్‌ క్రియేటర్లు డబ్బును సంపాందించనున్నారు.
చదవండి: ఈ బిల్లులతో అమెజాన్‌ ప్రైమ్‌ ఫ్రీ షిప్పింగ్‌కు కాలం చెల్లనుందా..!

మరిన్ని వార్తలు