జీవిత బీమా ప్రీమియంలో 17 శాతం వృద్ధి

12 Oct, 2022 08:13 IST|Sakshi

న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు సెప్టెంబర్‌ నెలకు మంచి పనితీరు చూపించాయి. నూతన పాలసీల ద్వారా ప్రీమియం (న్యూ బిజినెస్‌ ప్రీమియం) 17 శాతం పెరిగి రూ.36,366 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే నెలకు ప్రీమియం ఆదాయం రూ.31,001 కోట్లుగా ఉంది.

ప్రభుత్వరంగ ఎల్‌ఐసీ నూతన ప్రీమియం ఆదాయంలో మంచి వృద్ధిని చూపించింది. 35 శాతం అధికంగా రూ.24,991 కోట్ల ప్రీమియం ఆదాయం సంపాదించింది. 2021 సెప్టెంబర్‌లో ఎల్‌ఐసీ న్యూ బిజినెస్‌ ప్రీమియం ఆదాయం రూ.18,520 కోట్లుగా ఉంది. 

సెప్టెంబర్‌ నెల గణాంకాలను ఐఆర్‌డీఏఐ విడుదల చేసింది. ఇక 23 ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీలు ఉమ్మడిగా రూ.11,375 కోట్ల నూతన ప్రీమియం ఆదాయం సంపాదించాయి. 2021 సెప్టెంబర్‌ నెలకు ఇవే సంస్థలు సంపాదించిన కొత్త పాలసీల ప్రీమియం రూ.12,481 కోట్లతో పోలిస్తే 9 శాతం క్షీణించింది.

ఎస్‌బీఐ లైఫ్‌ ప్రీమియం ఆదాయం 15 శాతం తగ్గి రూ.2,471 కోట్లుగా ఉంటే, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఆదాయం 22 శాతం తగ్గి రూ.2,166 కోట్లకు పరిమితమైంది. బజాజ్‌ అలియాంజ్‌ ఆదాయం కూడా 38 శాతం తగ్గి రూ.670 కోట్లుగా నమోదైంది.  

మరిన్ని వార్తలు