Happy Birthday Anand Mahindra: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!

1 May, 2023 08:43 IST|Sakshi

పరిచయం అవసరం లేని పేర్లలో 'ఆనంద్ మహీంద్రా' ఒకటి. భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తల జాబితాలో ఒకరుగా నిలిచి, ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఉండే ఆనంద్ మహీంద్రా గురించి దాదాపు అందరికి తెలుసు. అయితే ఈ రోజు ఆనంద్ మహీంద్రా జన్మదినం సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

1955 మే 1న ముంబైలో హరీష్ మహీంద్రా, ఇందిరా మహీంద్రా దంపతులకు జన్మించారు. పారిశ్రామిక నేపథ్యం ఉన్న కుటుంభంలో జన్మించినప్పటికీ ఎప్పుడూ అతని కుటుంభ సభ్యులు వ్యాపార రంగానికి రావాలని బలవంతం చేయలేదు. కాబట్టి చిన్న తనంలో సినిమా ప్రొడ్యూసర్ కావాలని కలలు కనేవాడని చెబుతారు.

పాఠశాల విద్యను లారెన్స్ స్కూల్‌లో, ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సులను హార్వర్డ్ యూనివర్సిటీలో, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో MBA పూర్తి చేశారు 1981లో ఇండియాకి తిరిగి వచ్చారు. చదువు పూర్తయిన తరువాత ఆనంద్ మహీంద్రా ఉజిన్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ (ముస్కో)లో ఫైనాన్స్ డైరెక్టర్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా చేరి వ్యాపారాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో 1991లో సమ్మెలతో అట్టుడికిపోతున్న కండివాలీ ఫ్యాక్టరీ బాధ్యతలను చేప్పట్టవలసి వచ్చింది. 

కండివాలీ ఫ్యాక్టరీలో కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలు చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో కూడా ఎంతో నేర్పుగా ప్రవర్తించి ఆనంద్ మహీంద్రా ఆ సమస్యలను దూరం చేసి కార్మికులను శాంతింపజేశారు. ఇది ఆయన సాధించిన విజయాల్లో ప్రధానమైనదని చెప్పాలి.

అప్పట్లో ఆటోమొబైల్ రంగంలో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న భారతీయ కంపెనీలు వాహనాల తయారీకి ఎక్కువగా విదేశీ కంపెనీల మీద ఆధారపడవలసి వచ్చేది. కానీ ఆ సమయంలో ఫోర్డ్ కంపెనీతో కలిసి ఎస్కార్ట్ కారుని మార్కెట్లోకి పరిచయం చేశారు. కానీ ఇది ఆనంద్ మహీంద్రాకు ఆశించిన విజయాన్ని తీసుకురాలేకపోయింది. అయినా వెనుకడుగేయకుండా 300 మంది ఇంజినీర్లు, ఇతర సభ్యులతో ఒక టీమ్ తయారు చేసి ఒక ప్యాసింజర్ వెహికల్ తయారు చేయడానికి పూనుకున్నారు.

ఆనంద్ మహీంద్రా తయారు చేసిన ఈ టీమ్ అహర్నిశలు కస్టపడి మహీంద్రా స్కార్పియో కారుని భారతదేశంలో విడుదల చేసి గొప్ప విజయాన్ని తీసుకువచ్చింది. అప్పటి నుంచి ఆటోమొబైల్ రంగంపై ఆనంద్ మహీంద్రా మంచి పట్టుని సంపాదించాడు. మహీంద్రా స్కార్పియో కారు కేవలం భారత దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా మంచి ఆదరణ పొందింది. 

మహీంద్రా స్కార్పియోతో ఆశించిన స్థాయికంటే గొప్ప సక్సెస్ రుచి చూసిన ఆనంద్ మహీంద్రా స్వరాజ్ ట్రాక్టర్స్, పంజాబ్ ట్రాక్టర్స్ వంటి వాటిని కొనుగోలు చేసి మహీంద్రా గ్రూపుని ఎంతగానో విస్తరించాడు. ఇప్పుడు మహీంద్రా ట్రాక్టర్లు ప్రపంచంలో అత్యధిక ప్రహజాదరణ పొంది అమ్మకాల పరంగా ముందంజలో ఉన్నాయి.

(ఇదీ చదవండి: ఇంటర్‌లో తక్కువ మార్కులొచ్చాయని ఇల్లు అద్దెకివ్వని ఓనర్.. ఎక్కడో తెలుసా?)

ఆనంద్ మహీంద్రా ప్రముఖ పాత్రికేయరాలైన అనురాధను వివాహం చేసుకున్నారు. ఈమె 'వెర్వ్' అండ్ 'మ్యాన్స్ వరల్డ్' పత్రికలకు సంపాదకురాలు. అంతేకాకుండా ఆమె 'ది ఇండియన్ క్వార్టర్లీ' మ్యాగజైన్ పబ్లిషర్‌గా కూడా పనిచేశారు. వీరికి దివ్య మహీంద్రా, అలిక మహీంద్రా అనే ఇద్డు కుమార్తెలున్నారు.

వ్యారరంగంలో మాత్రమే కాకుండా గొప్ప సేవాదృక్పథం ఉన్న ఆనంద్ మహీంద్రా 1996లో భారతదేశంలోని నిరుపేద బాలికల విద్యకు మద్దతు ఇచ్చే నాన్హి కాళీ ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించాడు. 2017 వరకు ఈ ట్రస్ట్ సుమారు 1,30,000 మంది బాలికల విద్యకు దోహదపడింది. అంతే కాకూండా భారతదేశ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కృషి చేసే ట్రస్ట్ నాంది ఫౌండేషన్ డైరెక్టర్ బోర్డులలో ఒకరుగా ఉన్నారు.

(ఇదీ చదవండి: ఎగిరే కారు వచ్చేసిందండోయ్! రూ. 6.5 లక్షలతో ఇంటికి తీసుకెళ్లొచ్చు..)

2016లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్ మహీంద్రాని ఎన్నో అవార్డులు సైతం వరించాయి. భారత ప్రభుత్వం 2020లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందించింది. అంతకంటే ముందు 2012లో యుఎస్ బిజినెస్ కౌన్సిల్ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును, 2016లో బ్లూమ్‌బెర్గ్ టీవీ ఇండియా ద్వారా డిస్ట్రప్టర్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వంటి ఎన్నో అవార్డులను అందుకున్నాడు.

(ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్‌లో ఇవి గమనించారా? లేకుంటే పేలిపోతాయ్..)

పారిశ్రామిక రంగానికి వన్నె తెచ్చిన ఆనంద్ మహీంద్రాకు కార్లంటే ఇష్టమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కావున ఈయన గ్యారేజిలో ఇప్పటికే మహీంద్రా బొలెరో ఇన్వాడర్, టియువి300, టియువి300 ప్లస్, మహీంద్రా స్కార్పియో, ఆల్టురాస్ జి4, స్కార్పియో ఎన్ మొదలైన కార్లు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

మరిన్ని వార్తలు