విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సువిధ పోర్టల్‌

8 Aug, 2020 09:02 IST|Sakshi

ఇండియాకి వచ్చే వారు ఈ పోర్టల్‌ ద్వారా ఆరోగ్య పరిస్థితి వివరాలు ఇవ్వాలి

క్వారంటైన్‌ నుంచి మినహాయింపు కోసం 72 గంటలు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి

ఏపీకి వచ్చే అంతర్జాతీయ  ప్రయాణికులకు ఉపయోగకరం కానున్న సువిధ పోర్టల్‌

సాక్షి, అమరావతి: విదేశాల నుంచి వచ్చే వారు క్వారంటైన్‌లో ఉండకుండా నేరుగా ఇంటికి వెళ్లడానికి ఇప్పుడు అవకాశం లభించింది. దీని కోసం ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రయాణికులు తప్పనిసరిగా పూరించాల్సిన సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారం ఈ పోర్టల్‌ ద్వారా పూర్తి చేయాలి. తప్పనిసరి ఇనిస్టిట్యూషన్‌ క్వారంటైన్‌ నుంచి మినహాయింపు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఆన్‌లైన్‌ ఫాల్ట్‌ఫామ్‌ను  పౌర విమానయాన శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ మరియు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్,  మధ్యప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో రూపొందించినట్లు  ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్‌ (డీఐఏఎల్‌) శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

అందులో తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 8, 2020 నుండి భారతదేశానికి తిరిగి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు తిరిగి వచ్చిన అనంతరం వివిధ ఫారాలను భౌతికంగా తాకే పని లేకుండా కాంటాక్ట్‌ లెస్‌ విధానంలో ఎయిర్‌ సువిధ ద్వారా పూర్తి చేయవచ్చు. క్వారంటైన్‌ మినహాయింపు కోరే ప్రయాణికులు అయిదు నిర్ధిష్టమైన విభాగాల కింద ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ వెబ్‌సైట్‌  ఠీఠీఠీ. n్ఛఠీఛ్ఛీ జిజ్చీజీటఞౌట్ట.జీn లో ఈ–ఫారంను నింపాలి. విమానం బయలు దేరే సమయానికి కనీసం 72 గంటల ముందు ఈ ఈ–ఫారమ్‌ను ఇతర సంబంధిత డాక్యుమెంట్లు, పాస్‌పోర్టు కాపీలతో సహా జత చేయాల్సి ఉంటుంది. అయితే ప్రయాణికులు పూర్తి చేయాల్సిన సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారమ్‌కు మాత్రం ఎలాంటి కాలపరిమితి లేదు. దీనితో విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయాణికులకు ఊరట లభించనుంది. 

మరిన్ని వార్తలు