International Womens Day: మహిళల హైరింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం

7 Mar, 2023 00:54 IST|Sakshi

ఫౌండిట్‌ సర్వేలో వెల్లడి

ముంబై: దేశీయంగా ఉద్యోగ నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యమిచ్చే ధోరణి పెరుగుతోంది. కంపెనీల్లో వైట్‌ కాలర్‌ ఉద్యోగాల్లో (ఆఫీసుల్లో చేసే) మహిళల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో డిమాండ్‌ 35 శాతం పెరిగింది. జాబ్‌ ప్లాట్‌ఫామ్‌ ఫౌండిట్‌ (గతంలో మాన్‌స్టర్‌ ఏపీఏసీ, ఎంఈ) తమ పోర్టల్‌లో నమోదైన హైరింగ్‌ గణాంకాల ఆధారంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే దిశగా.. నెలసరి, శిశు సంరక్షణ తదితర సందర్భాల కోసం ప్రత్యేకంగా సెలవులు ఇవ్వడం, కార్యాలయాల్లో పక్షపాత ధోరణులను నిరోధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంలాంటి అంశాలపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. అలాగే పని విషయంలో వెసులుబాటు కల్పించడం వంటివి చేస్తున్నాయి. మహిళా ఉద్యోగులకు డిమాండ్‌పరంగా చూస్తే ఐటీఈఎస్‌/బీపీవో రంగంలో అత్యధికంగా 36 శాతం, ఐటీ/కంప్యూటర్స్‌–సాఫ్ట్‌వేర్‌ (35%), బ్యాంకింగ్‌/అకౌంటింగ్‌/ఆర్థిక సర్వీసులు (22%)గా ఉంది.

మరిన్ని వార్తలు