International Womens Day: వాణిజ్య వాహనాల డ్రైవర్లుగా మహిళలు

9 Mar, 2023 00:45 IST|Sakshi

అశోక్‌ లేలాండ్‌ చొరవ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాహన తయారీ దిగ్గజం అశోక్‌ లేలాండ్‌ ఎంబ్రేస్‌ ఈక్విటీ పేరుతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు సమాన అవకాశాలను అందించే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అశోక్‌ లేలాండ్‌కు చెందిన ట్రైనింగ్‌ సెంటర్‌లో భారీ వాణిజ్య వాహనాలు, బస్‌లు నడపడంపై శిక్షణ పొందేందుకు 100 మంది మహిళలను న్యూఢిల్లీకి ఆహ్వానించింది.

‘వాస్తవానికి భారీ వాణిజ్య వాహనాల డ్రైవింగ్‌ అనేది పురుషుల బలమనే ప్రచారం ఉంది. ఎంబ్రేస్‌ ఈక్విటీ ద్వారా దీనిని ఛేదించాలనేది కంపెనీ ఆలోచన’ అని అశోక్‌ లేలాండ్‌  తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ పరివర్తన్‌ కార్యక్రమం కోసం ఇటీవల భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు కంపెనీ తెలిపింది. దీనిలో భాగంగా 180 మంది మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ కల్పించింది. వీరిలో చాలా మంది ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లో డ్రైవర్లుగా నియామకం అందుకున్నారని అశోక్‌ లేలాండ్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు