సెన్సెక్స్‌ ఆల్‌-టైం రికార్డ్‌: ఎందుకో తెలుసా?

21 Jun, 2023 14:15 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీ సెన్సెక్స్‌ బుదవారం ఆల్-టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. 63,588 వద్ద సెన్సెక్స్‌ రికార్డ్‌ స్థాయికి చేరింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దలాల్ స్ట్రీట్‌లో 9 బిలియన్ల  డాలర్ల బలమైన వాలెట్‌ను ప్రారంభించడంతో, సెన్సెక్స్ రికార్డు  స్థాయిని టచ్‌ చేసింది.  దాదాపు 137 రోజుల తరువాత  ఆల్‌టైం హైని తాకింది.  గత ఏడాది డిసెంబర్ 1న గత ఏడాది గరిష్ట స్థాయికి చేరుకుంది.

చివరికి  సెన్సెక్స్‌ 195 పాయింట్ల లాభంతో 53,523వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు ఎగిసి 18,857 రికార్డు గరిష్టాల వద్ద స్థిరపడ్డాయి. పటిష్టంగా ఉన్నజీడీపీ ఔట్‌లుక్,  ద్రవ్యోల్బణం తగ్గు ముఖం, విదేశీ పెట్టుబడిదారుల బలమైన కొనుగోళ్లతో సహా బలమైన ఫండమెంటల్స్ మార్కెట్లను ఆల్‌ టైంకి చేర్చాయని మార్కెట్‌ పండితుల మాట. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!)

అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు సెన్సెక్స్ కొత్త  శిఖరానికి చేరడంతో ఇకపై మార్కెట్‌ నెమ్మదిగా, స్థిరంగా సాగుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.  యోగాలో, బాహ్య ప్రపంచం కంటే లోపలి  ప్రపంచంపైనే  దృష్టి ఉంటుంది. మార్కెట్‌లో కూడా పెట్టుబడిదారులు ఇండెక్స్ స్థాయి కంటే లక్ష్యంపై దృష్టి పెట్టాలి. యోగాలో, సుదీర్ఘ కాల వ్యవధిలో ప్రయోజనాలుంటాయి.  మార్కెట్‌లో దీర్ఘకాలికంగా  చాలా  ప్రయోజనకరంగా ఉంటుందని  కోటక్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన నీలేష్ షా వ్యాఖ్యానించడం విశేషం.

అటు నిఫ్టీ  కూడా అదే స్థాయిలో ట్రేడ్‌ అయింది. ఫ్టాట్‌గా ప్రారంభమైనప్పటికీ, వెంటనే లాభాల్లోకి మళ్లాయి. కానీ తరువాత లాభాల స్వీకరణ కారణంగా సూచీలు  ఫ్లాట్ జోన్‌లోకి మారాయి. ఫైనాన్స్, మీడియా, రియల్టీ లాభాల్లో ఉండగా, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు నష్ట పోతున్నాయి. పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఓఎన్‌జీసీ టాప్‌ లాభాల్లో ఉండగా, జేఎస్‌డబ్ల్యూ ‍స్టీల్‌, హిందాల్కో, దివీస్‌, యాక్సిస్‌ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్‌ నష్ట పోతున్నాయి. అటు డాలరుమారకంలో దేశీయ  కరెన్సీ రూపాయి స్వల్ప నష్టాలతో 82.10 వద్ద కొనసాగుతోంది.  (మరిన్ని బిజినెస్‌  వార్తలు, అప్‌డేట్స్‌ కోసం చదవండి: సాక్షిబిజినెస్‌)

మరిన్ని వార్తలు