Internet To Stop : వీటిలో ఇంటర్నెట్‌ సేవలు బంద్‌..!

29 Sep, 2021 21:17 IST|Sakshi

రేపటి నుంచి అనగా సెప్టెంబర్‌ 30 నుంచి పలు డివైజ్‌ల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. Let’s Encrypt’sకు చెందిన IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్‌ గడువు రేపటితో ముగియనుంది. దీంతో పలువురు ఈ సర్టిఫికేట్లను కల్గిన డివైజ్‌లో వరల్డ్‌ వైడ్‌ వెబ్‌సేవలను పొందలేరని టెక్నికల్‌ నిపుణులు పేర్కొన్నారు. 

లెట్స్ ఎన్‌క్రిప్ట్ (Let's Encrypt) అనేది  నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్.  మొబైల్, ల్యాప్‌టాప్, పర్సనల్‌కంప్యూటర్స్‌   వంటి పరికరాల మధ్య ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఈ ఆర్గనైజేషన్‌ ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ఈ సర్టిఫికేషన్  సహాయంతో మనం వాడే డివైజ్‌లకు ఏలాంటి హాని లేకుండా, సురక్షితమైన ఇంటర్నెట్‌ సేవలు అందుతాయి. అంతేకాకుండా మీ పర్సనల్‌ డేటాను హ్యక్‌ కాకుండా చూస్తోంది. మనం బ్రౌజింగ్‌ చేసేటప్పుడు యూఆర్‌ఎల్‌ అడ్రస్‌లో మొదట హెఛ్‌టీటీపీఎస్‌తో ఆయా వెబ్‌సైట్‌ వస్తోంది. ఈ విషయాన్ని మనలో కొంత మంది గమనించే ఉంటాం. హెఛ్‌టీటీపీఎస్‌ ప్రారంభమయ్యే వెబ్‌సైట్‌ అత్యంత సురక్షితమని అర్థం. ఈ ప్రాసెస్‌ పూర్తిగా IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్‌ సహాయంతోనే జరుగుతుంది.
చదవండి: Jeans Could Get Pricey: జీన్స్‌, టీషర్ట్స్‌ లవర్స్‌కు షాకింగ్‌ న్యూస్‌...!

ప్రభావం ఎక్కువగా వీటిపైనే..!
IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్‌ ఆప్‌డేట్‌ అయిన డివైజ్‌లకు ఏలాంటి ప్రాబ్లమ్‌ లేదు. ఏళ్ల తరబడి ఎలాంటి ఆప్‌డేట్‌కు నోచుకొని డివైజ్‌ల్లో ఇంటర్నెట్‌ సేవలు ముగియనున్నాయి.  టెక్‌ క్రచ్‌ నివేదిక ప్రకారం...మాక్‌ఓఎస్‌ 2016 వర్షన్‌, పలు ఓల్డ్‌ ఐఫోన్స్‌, విండోస్‌ ఎక్స్‌పీ(విత్‌ సర్వీస్‌ పాక్‌ 3), ప్లే స్టేషన్‌ కన్‌సోల్‌ 3.  ప్లేస్టేషన్ 4 వంటి అప్‌గ్రేడ్‌ కాని వాటిలో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోతాయి. 

ఇలా చేస్తే బెటర్‌ 
సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత 7.1.1 కంటే పాత వెర్షన్‌లను కలిగి ఉన్న అన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌ లలో ఇంటర్నెట్ పని చేయదు. ఐవోఎస్‌ 10 కంటే పాత వెర్షన్‌లను కలిగి ఉన్న  ఐఫోన్‌లలో కూడా ఇంటర్నెట్ సేవలు పని చేయవు. మీ డివైజ్‌ లలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, వెంటనే మీ ఫోన్ లో చెక్ చేసి, పాత వర్షన్ ఉంటే వెంటనే అప్డేట్ చేయండి. ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌ వర్షన్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు మోజిలా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ను ఉపయోగిస్తే ఇంటర్నెట్‌ సేవలను పొందవచ్చునని తెలుస్తోంది. 
చదవండి: భారీ డిస్కౌంట్లతో ముందుకువస్తోన్న షావోమీ..! సుమారు రూ. 75 వేల వరకు తగ్గింపు..!

మరిన్ని వార్తలు