అమెజాన్‌ వెర్షన్‌ చిట్టి రోబో

29 Sep, 2021 12:38 IST|Sakshi

ఇంట్లో ఉన్నప్పుడు మనకు సహాయకారిగా బయటకు వెళ్లినప్పుడు ఇంట్లో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు మనకు చేరవేసే సరికొత్త రోబోను అమెజాన్‌ రెడీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను అమెజాన్‌ వెల్లడించింది.

అస్ట్రో.. 
రోటేటింగ్‌ బేస్‌పై 360 డిగ్రీస్‌ ఫ్లెక్సిబులిటీ ఉన్న డిస్‌ప్లేతో ఆస్ట్రో రోబోని అమెజాన్‌ రూపొందించింది. 17 ఇంచుల ఎత్తు ఉండే ఈ రోబోకి ఆస్ట్రోగా పేరు పెట్టింది. 


అలెక్సాతో
ఆస్ట్రోలో అలెక్సా వాయిస్‌ కమాండ్‌ ఫీచర్‌ని పొందు పరిచారు. దీంతో వాయిస్‌తో కమాండ్‌ ఇవ్వగానే దానికి అనుగుణంగా పనులు చేసి పెడుతుంది. అంతేకాకుండా దీనికి డిస్‌ప్లేకి అమర్చిన కెమెరాల సాయంతో ఫేస్‌ రికగ్నేషన్‌ను కూడా ఉపయోగిస్తుంది. 


చిన్న చిన్న పనులు
కాఫీకప్‌, సోడా సీసా, ప్యాకెట్లు ఇలా చిన్న చిన్న వస్తువులను ఒక చోటి నుంచి మరో చోటికి మోసుకెళ్లగలదు. అంతేకాదు మనం ఇంట్లో లేని సమయంలో ఇళ్లు ఎలా ఉందో ఎప్పటికప్పుడు వీడియో కాల్‌ ద్వారా చూపించగలదు


డ్యాన్స్‌ కూడా
ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారంగా మనం ఇచ్చే కమాండ్స్‌కి అనుగుణంగా డ్యాన్స్‌ చేయడం, పాటలు పాడటం వంటి పనులు చేయగలదు. 

ధర ఎంతంటే
అమెజాన్‌ సంస్థ ఇంకా ఆస్ట్రోని మార్కెట్‌లోకి రిలీజ్‌ చేయలేదు. కేవలం అమెరికాలోని యాభై రాష్ట్రాల్లో ఎంపిక చేసిన వ్యక్తులకే ఈ రోబోను అందివ్వాలని అమెజాన్‌ నిర్ణయించింది. ఈ రోబో ధర 1,499 డాలర్లుగా నిర్ణయించారు. ప్రారంభం ఆఫర్‌గా 999 డాలర్లకే అందిస్తామని అమెజాన్‌ ప్రకటించింది

సెల్ఫ్‌ ఛార్జ్‌
బ్యాటరీ లో అయిన వెంటనే తనంతట తానుగా రీఛార్జ్‌ పాయింట్‌కి చేరుకుని సెల్ఫ్‌ ఛార్జ్‌ చేసుకోవడం ఆస్ట్రో ప్రత్యేకత 
 

చదవండి : Amazon: పాఠశాల స్థాయి నుంచే కంప్యూటర్‌ సైన్స్‌

>
మరిన్ని వార్తలు