‘జీ’ కప్పులో చల్లారని తుఫాను.. కొత్త చిక్కుల్లో సోని

27 Sep, 2021 11:21 IST|Sakshi

ఇండియాలోనే అతి పెద్ద టీవీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌గా చెప్పుకుంటున్న జీ - సోనీ విలీన ప్రక్రియలో మలుపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కంపెనీలో మేజర్‌ షేర్‌ హోల్డర్లు పట్టు వదిలేందుకు సిద్ధంగా లేరు. 

ఇన్వెస్కో లేఖ
జీ లిమిటెడ్‌కి ఎండీ, సీఈవోగా ఉన్న పునీత్‌ గోయోంకాను తొలగించడంతో పాటు ఆరుగురు డైరెక్టర్లను తొలగించాలంటూ  జీలో మేజర్‌ షేర్‌హోల్డర్‌గా ఉన్న ఇన్వెస్కో  జీ బోర్డును కోరింది. అందుకు గల కారణాలు వివరిస్తూ బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. 

తెరపైకి విలీనం
ఇన్వెస్కో నుంచి లేఖ వచ్చిన వెంటనే స్పందించిన జీ బోర్డు ఇద్దరు డైరెక్టర్లను తప్పించింది. అనంతరం సోనీతో చర్చలు ప్రారంభించింది. ఆ తర్వాత సోనీలో జీ విలీనం అవుతున్నట్టు భారీ డీల్‌ని సెప్టెంబరు 22న ప్రకటించింది. ఈ రెండు సంస్థల విలీనం తర్వాత ఏర్పడే సంస్థకు సైతం పునీత్‌ గోయెంకానే ఎండీగా ఉంటాడని ప్రకటించింది.  దీంతో వివాదం సమసిపోతుందని జీ భావించింది. ఇన్వెస్కో కోరినట్టు అత్యవసర సమావేశం నిర్వహించలేదు.
‍న్యాయ పోరాటం
జీలో మేజర్‌ షేర్‌ హోల్డర్‌గా తాము అభ్యంతరం చెప్పిన విషయాలపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడమే కాకుండా విలీన ప్రక్రియ జరపడం, ఆ తర్వాత పునీత్‌ గోయెంకానే తిరిగి ఎండీగా నియమించడం పట్ల ఇన్వెస్కో అసంతృప్తిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతుంది. లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సోనికి చిక్కులు
జీని విలీనం చేసుకోవడం ద్వారా ఒకే సారి అర్బన్‌, రూరల్‌ మార్కెట్‌లతో పాటు హిందీ, రీజనల్‌ లాంగ్వెజ్‌లలో మరింతగా విస్తరించాలనుకున్న సోనికి ఇన్వెస్కో వ్యవహరం కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. జీ అంతర్గత సమస్యలు ఇప్పుడు సోనిని కూడా చుట్టుముట్టాయి

నామ్‌కే వాస్తే
సుభాష్‌ చంద్ర స్థాపించిన జీ మీడియాలో ప్రస్తుతం ఆయన వాటా కేవలం 5 శాతమే. చాలా మంది ఆ కంపనీలో పెట్టుబడులు పెట్టారు. నిన్నా మొన్న సోనీతో విలీన ప్రక్రియ ముగిసే వరకు ఇన్వెస్కో సంస్థ జీలో మేజర్‌ పెట్టుబడిదారుగా ఉంది. 
చదవండి: సోనీకి ‘జీ’ హుజూర్‌!

మరిన్ని వార్తలు