నెలకు రూ.12వేలు పెన్షన్‌  కావాలా? ఇలా ట్రై చేయండి! 

9 Jan, 2023 16:48 IST|Sakshi

సాక్షి, ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)  ఇన్సూరెన్స్ కవర్‌తో పాటు,భారీ రాబడితో కస్టమర్ల ఆదరణతో మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందింది.  తాజాగా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది.  వినియోగదారులు ఒకసారి పెట్టుబడి పెట్టి నెలకు 11వేలు ఆర్జించే ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి స్కీమ్‌  గురించి తెలుసుకుందాం.  

ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి  ద్వారా  నెలకు రూ.11000  ఎలా?
ఎల్‌ఐసీ కొత్త జీవన్ శాంతి పథకంలో పెట్టుబడి పెట్టగల కనీస మొత్తం రూ. 1.5 లక్షలు. ఈ పథకం ద్వారా 12వేల కనీస రాబడి  లభిస్తుంది. అలాగే ఈ పథకంలో పెట్టుబడి మొత్తంపై గరిష్ట పరిమితి లేదు.. ఎంతయినా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అయితే నెలకు రూ. 11,000 కంటే ఎక్కువ సంపాదించాలంటే మాత్రం కనీసం రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తద్వారా ఈ ప్లాన్ ద్వారా నెలవారీ పెన్షన్ రూ. 11,192  పొందవచ్చు. అలాగే జాయింట్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీ విషయంలో, నెలవారీపెన్షన్ రూ. 10,576.  మరింత సమాచారం కోసం LIC ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మరిన్ని వార్తలు