రోజు రూ.100 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.15 లక్షలు మీ సొంతం..!

8 Aug, 2021 21:19 IST|Sakshi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తన ఖాతాదారులకు సరికొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. సుకన్య సమృద్ది యోజన కింద పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ పథకం కింద పంజాబ్‌ బ్యాంకులోని ఏ శాఖలోనైనా ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఈ ఖాతాను తెరవవచ్చును. ఒక పేరెంట్‌గా, మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో సుకన్య సమృద్ధి ఖాతాలో రూ .250 కనీస డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ .1,50,000 డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంది.

తల్లిదండ్రులు ఖాతా ఓపెన్ చేసిన 15 సంవత్సరాల వరకు లబ్దిదారుల ఖాతాలో ప్రీమియం అమౌంట్‌ను డిపాజిట్‌ చేయవచ్చును. ఖాతా తెరిచిన తేదీ నాటికి లబ్ధిదారులకు 10 సంవత్సరాలు నిండి ఉండకూడదు .సుకన్య సమృద్ధి ఖాతాలపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది. ఈ ఖాతాలపై బ్యాంకు 7.6 శాతం వడ్డీ రేటును ఇ‍వ్వనుంది. ఈ ఖాతాలను పోస్టాఫీసులకు బదిలే చేసుకునే సౌకర్యాన్ని పీఎన్‌బీ బ్యాంకు కల్పిస్తుంది. 

అకౌంట్ హోల్డర్ ఉన్నత విద్య కోసం, ఖాతాలోని అమౌంట్‌ నుంచి గరిష్టంగా 50 శాతం వరకు విత్‌డ్రా చేయవచ్చును. సుకన్య సమృద్ధి ఖాతా ఓపెన్‌ అయినప్పటి నుంచి మెచ్యూరిటీ కాలం  21 సంవత్సరాలుగా ఉండనుంది. మీరు సుకన్య సమృద్ధి ఖాతాలో రోజుకు రూ.100 చొప్పున అంటే నెలకు  రూ .3000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ కాలం మిగిసే సమయానికి లబ్థిదారులు రూ .15 లక్షలకు పైగా పొందవచ్చును. ఏటా రూ .36,000 డిపాజిట్ చేయడం ద్వారా, మీరు 14 సంవత్సరాల తర్వాత 7.6 శాతం వడ్డీరేటుతో రూ .9,11,574 వరకు పొందుతారు.  21 సంవత్సరాల తర్వాత, అమౌంట్‌ రూ .15,22,221 వరకు వస్తోంది.

మరిన్ని వార్తలు