ఎన్‌ఆర్‌ఐల ఈక్విటీ పెట్టుబడులకు ఇన్వెస్ట్‌ 19 వేదిక

7 Sep, 2021 02:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) భారత ఈక్విటీ మార్కెట్లలో నేరుగా ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలుగా ఒక గేట్‌వేను ఆవిష్కరించనున్నట్టు ఇన్వెస్ట్‌ 19 ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్‌–డిసెంబర్‌ నాటికి ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ కంపెనీ ఇప్పటికే ఆన్‌లైన్‌ మల్టీబ్రోకింగ్‌ సేవలు అందిస్తోంది. ఒకే క్లిక్‌తో భారత ఈక్విటీల్లో పెట్టుబడుల అవకాశాలను ఎన్‌ఆర్‌ఐలకు కలి్పంచాలన్న ప్రణాళికతో ఉన్నట్టు వివరించింది. నిరీ్ణత శాతం మేర దేశ పౌరులు విదేశాల్లో నివసిస్తున్నారని.. వారు భారత ఈక్విటీ మార్కెట్లలో సులభంగా ఇన్వెస్ట్‌ చేసుకునే మార్గం లేదని ఇన్వెస్ట్‌19 వ్యవస్థాపకుడు, సీఈవో కౌసలేంద్రసింగ్‌ సెంగార్‌ తెలిపారు. యూఎస్, బ్రిటన్, ఆ్రస్టేలియాలో ఒక శాతానికిపైనే భారత సంతతి ప్రజలున్నట్టు.. కెనడాలో అయితే 4 శాతానికి పైనే ఉన్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు