5జీపై రూ. 2.3 లక్షల కోట్ల పెట్టుబడులు

20 Oct, 2020 05:43 IST|Sakshi

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంచనా  

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 5జీ సేవలందించేందుకు స్పెక్ట్రం, సైట్లు, ఫైబర్‌ నెట్‌వర్క్‌పై టెలికం కంపెనీలు దాదాపు రూ. 1.3–2.3 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు పెట్టాల్సి రావొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌(ఎంవోఎఫ్‌ఎస్‌) ఒక నివేదికలో అంచనా వేసింది. ఒక్క ముంబై సర్కిల్‌లోనే 5జీ నెట్‌వర్క్‌పై రూ. 10,000 కోట్లు, ఢిల్లీలో రూ. 8,700 కోట్లు ఇన్వెస్ట్‌ చేయాల్సి వస్తుందని పేర్కొంది. మధ్య లేదా కనిష్ట స్థాయి బ్యాండ్‌ స్పెక్ట్రం రిజర్వ్‌ ధర ప్రాతిపదికన ఎంవోఎఫ్‌ఎస్‌ ఈ లెక్కలు వేసింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ రిజర్వ్‌ ధర ప్రకారం ముంబైలో 100 మెగాహెట్జ్‌ మిడ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రం కోసం రిజర్వ్‌ ధర రూ. 8,400 కోట్లుగా ఉండనుంది. మరిన్ని కంపెనీలు తీవ్రంగా పోటీపడితే బిడ్డింగ్‌ ధర మరింతగా పెరగవచ్చు. కవరేజీ కోసం కనీసం 9,000 సైట్లు అవసరమయిన పక్షంలో వీటిపై సుమారు రూ. 1,800 కోట్లు ఇన్వెస్ట్‌ చేయాల్సి రావొచ్చు. దీంతో ముంబైలో 5జీ నెట్‌వర్క్‌పై వెచ్చించాల్సిన మొత్తం రూ. 10,000 కోట్ల స్థాయిలో ఉండనుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు