200 లక్షల కోట్లను దాటేసిన ఇన్వెస్టర్ల సంపద

4 Feb, 2021 14:21 IST|Sakshi

50630  వద్ద సెన్సెక్స్‌ సరికొత్త ఆల్‌ టైం హై

14900 దాటేసిన నిఫ్టీ 

సాక్షి,ముంబై: బడ్జెట్‌ 2021 తరువాత  దలాల్‌ స్ట్రీట్‌ సరికొత్త  రికార్డులకు నెలవుగా మారింది. కీలక సూచీలు  సరికొత్త జీవితాకాల గరిష్టాలను  నమోదు చేసిన నేపథ్యంలో పెట్టుబడిదారుల సంపద కూడా రికార్డుస్థాయికి చేరింది. గురువారం ఆరంభంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ ప్రపంచ  మార్కెట్ల సానుకూ సంకేతాలతో  మిడ్‌ సెషన్‌ నుంచి లాభాల్లోకి మళ్లింది. దీంతో సెన్సెక్స్ 50,474 గరిష్ట స్థాయిని టచ్‌ చేసింది. అనంతరం సరికొత్త గరిష్టాల దిశగా సెన్సెక్స్‌ దూకుడును కొనసాగిస్తోంది.

ఫలితంగా  బిఎస్‌ఇ-లిస్టెడ్ సంస్థల ఆర్కెట్ క్యాప్ మొదటిసారి రూ .200 లక్షల కోట్లు దాటింది. అంతకుముందు రూ .198.3 లక్షల కోట్లతో పోలిస్తే పెట్టుబడిదారుల సంపద తాజాగా రూ .200.11 లక్షల కోట్లకు పెరిగింది. నేటి సెషన్‌లో  350 పాయింట్లకు పైగా జంప్‌ చేసిన సెన్సెక్స్,  50614 వద్ద, నిఫ్టీ  14,900 వద్ద  సరికొత్త రికార్డులను నమోదు చేసాయి. ఐటిసి, ఎంఅండ్ ఎం, ఒఎన్‌జిసి, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టిపిసి  టాప్‌  గెయినర్స్‌గాఉన్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 256 పాయింట్లు ఎగిసి 50522 వద్ద, నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో 14874 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. 

కాగా బడ్జెట్‌  తర్వాత  సెన్సెక్స్ గత నాలుగు సెషన్లలో 4,189 పాయింట్లు సాధించగా పెట్టుబడిదారుల సంపద రూ .13.99 లక్షల కోట్లు పెరిగింది.  బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ 2014 నవంబర్ 28 న తొలిసారిగా రూ.100 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. తాజాగా ఇది రెట్టింపై 200 లక్షల కోట్లకు చేరింది. 

మరిన్ని వార్తలు