డబ్బులే డబ్బులు...గంటలోనే రూ. 3 లక్షల కోట్లను వెనకేశారు..!

4 Apr, 2022 15:50 IST|Sakshi

దేశీయ సూచీలు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే భారీ లాభాలతో ముందుకుసాగాయి. తొలి గంటలోనే ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ విలీన ప్రతిపాదనపై ఈక్విటీలు పుంజుకోవడంతో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి గంటలోనే ఇన్వెస్టర్లు రూ. 3 లక్షల కోట్లకు పైగా సంపాదించారు .

ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను ప్రతిబింబిస్తూ, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్ 1,472.33 పాయింట్లు లేదా 2.46 శాతంతో 60,736.08 పాయింట్లకు చేరుకుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ హెచ్‌డీఎఫ్‌సీ నిర్ణయంతో బుల్‌ రంకెలు వేస్తూ పరుగులు తీసింది. 

బీఎస్‌ఈ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్, ఏకంగా రూ.2,71,36,569.94 కోట్లకు పెరిగింది. గత వారం  శుక్రవారం బీఎస్‌ఈలో ట్రేడింగ్ ముగిసే సమయానికి మార్కెట్ వాల్యుయేషన్‌తో పోలిస్తే ఇది రూ. 3.11 లక్షల కోట్లకు పైగా లాభాన్ని సూచిస్తుంది.

బీఎస్‌ఈ డేటా ప్రకారం...137 స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయిని తాకగా, 416 స్క్రిప్‌లు ఎగువ సర్క్యూట్‌కు చేరుకున్నాయి. ఉదయం ట్రేడింగ్‌లో, మొత్తం 25 స్టాక్స్‌ లాభాలను గడించాయి.అందులో కేవలం హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు దాదాపు 14 శాతం వరకు లాభపడ్డాయి.

చదవండి: కళ్లుచెదిరే లాభం.. కేవలం 5 నెలల్లో ఒక లక్షకు రూ. 85 లక్షల జాక్‌పాట్‌ కొట్టేశారు..!

మరిన్ని వార్తలు