కోవిడ్ స్ట్రెయిన్ : ఒక్కరోజే లక్షల కోట్లు ఢమాల్‌

22 Dec, 2020 16:12 IST|Sakshi

 సోమవారం ఒక్కరేజే ఆరున్నర లక్షల కోట్లు  ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

సాక్షి, ముంబై:  సరికొత్త గరిష్టాలతో దూకుడుమీద ఉన్న దేశీయ స్టాక్‌మార్కెట్లకు కోవిడ్ స్ట్రెయిన్ దెబ్బ భారీగా తగిలింది. మరో ప్రాణాంతకమైనకొత్త వైరస్‌ను గుర్తించామంటూ యూ​కే ప్రకటించిన నేపథ్యంలో  ఇన్వెస‍్టర్ల సంపద ఒక్కరోజులో  పెద్ద మొత్తంలో ఆవిరైపోయింది. ఒక్క సోమవారం రోజు స్టాక్ మార్కెట్లో దాదాపు 6.64లక్షల కోట్ల సంపద  హారతి కర్పూరంలా హరించుకుపోయింది. బీఎస్‌ఈ  లిస్టెడ్ కంపెనీల కేపిటలైజేషన్ మొత్తం 185.39 కోట్లు ఉండగా.. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి 178.75 కోట్లుగా ఉంది. సెన్సెక్స్ 3శాతం, నిఫ్టీ 3.14శాతం పడిపోవడంతో భారీగా నష్టపోయారు ఇన్వెస్టర్లు. అయితే మంగళవారం ఆరంభంలో బలహీన పడిన సూచీలు ముగింపులో కోలుకున్నాయి. సెన్సెక్స్‌  452 పాయింట్లు ఎగిసి 46 వేల ఎగువన ముగియగా, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 13466 వద్ద  స్థిరపడటం విశేషం.

కరోనా వైరస్ దెబ్బకు  సోమవారం అన్ని సెక్టార్లు దెబ్బతిన్నాయి.  భారీనుంచి అతి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, యుటిలిటీస్, రియాల్టీ, బేసిక్ మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్, పవర్, బాంక్స్ 6.05 శాతం కుప్పకూలాయి. అయితే ప్రస్తుతం ట్రెండ్ వైరస్ కారణంగా జరిగిందేనని.. ఇక ముందు పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు. 7-10 శాతం వరకూ పడినా మళ్లీ అందుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కీలక సూచీలు సెన్సెక్స్‌,నిఫ్టీ రెండూ ఇటీవల గరిష్ట స్తాయిలను తాకిన క్రమంలో ప్రాఫిట్‌ బుకింగ్‌ కూడా ఒక కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ స్ట్రాటజీ బినోద్ మోడీ అన్నారు. అయితే కొత్త వైరస్‌ ఆందోళనలు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు  నేపథ్యంలో అప్రమత్తంగా  ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు