Meta: మార్క్‌ జుకర్‌బర్గ్‌కు ఇన్వెస్టర్ల షాక్‌: మార్కెట్‌ వాల్యూ ఢమాల్‌!

27 Oct, 2022 16:10 IST|Sakshi

న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా మరోసారి ఫలితాల్లో ఢమాల్‌ అంది. వరుసగా రెండో త్రైమాసికంలో కూడా ఆదాయ క్షీణత నమోదు చేసింది. మెటావర్స్‌పై అనాసక్తతకు తోడు ప్రకటనల ఆదాయం క్షీణించడం, ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ నుంచి ఎదురవుతున్న పోటీ కారణంగా మెటా ఆదాయం పడిపోయింది. సెప్టెంబర్ 30తో ముగిసిన క్యార్టర్‌-2 ఫలితాల్లో ఆదాయం 4శాతం తగ్గి 27.71 బిలియన్ల డాలర్లకు చేరింది. అంతకుముందు ఇది  29.01 బిలియన్ల డాలర్లుగా ఉంది. మెటావర్స్ ప్రాజెక్ట్‌పై చేసిన అపారమైన, ప్రయోగాలకు మొత్తం ఖర్చుల్లో ఐదవ వంతు ఖర్చుపెట్టారు మెటా బాస్ మార్క్ జుకర్‌బర్గ్ .

అయితే  కంపెనీ ఒక్కోషేరు ఆదాయంలో అంచనాలకు అందుకోలేక చతికిలపడింది.  అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన3.22  డాలర్లనుంచి 52 శాతం పడిపోయి  1.64 డాలర్లను మాత్రం సాధించింది.  అలాగే మెటా  రియాలిటీ ల్యాబ్స్ యూనిట్, దాని మెటావర్స్ మూడవ త్రైమాసికంలో 3.67 బిలియన్‌ డాలర్ల నిర్వహణ నష్టాన్నినమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరంతో నష్టంతో పోలిస్తే ఇది అధికం.

ఈ ఫలితాల నేపథ్యంలోవాల్ స్ట్రీట్‌లో మెటా షేరు ఏకంగా 20 శాతం కుప్పకూలింది. 2016 కనిష్ట స్థాయిని తాకింది.  ఈ ఏడాదిలో మెటాషేరు 61శాతం  క్షీణించడం గమనార్హం. తాజా నష్టంతో 67 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌  వాల్యూ హరించుకు పోయింది.  కాగా మెటా పెట్టుడులపై  పెట్టుబడిదారుల ఆందోళన నేపథ్యంలో మెటావర్స్ పేరిట కంపెనీ అనవసర ఆలోచనలు చేస్తోందని మెటా వాటాదారు ఆల్టిమీటర్ క్యాపిటల్ సీఈఓ బ్రాడ్ గెర్స్ట్నర్ ఈ వారం ప్రారంభంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌ బర్క్‌పై లేఖ రాసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు