రెండు రోజుల్లో దశ తిరిగింది.. రూ.5.47 లక్షల కోట్ల లాభం?

2 Dec, 2021 21:26 IST|Sakshi

రెండు రోజులు వరుసగా స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగియడంతో పెట్టుబడిదారుల పంట పండింది. రెండు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 1500 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా ఎగబాకింది. భారత మార్కెట్లో విపరీతమైన కొనుగోలు కారణంగా పెట్టుబడిదారుల ఆస్తులు కేవలం రెండు రోజుల్లో 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగాయి. మార్కెట్ విజృంభణ కారణంగా పెట్టుబడిదారుల ఆస్తులు విలువ నేడు రూ.3.28 లక్షల కోట్లు పెరిగి రూ.257.62 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పెట్టుబడిదారుల ఆస్తులు విలువ బుధవారం రూ.2.19 లక్షల కోట్లు పెరిగాయి. అంటే రెండు రోజుల్లో పెట్టుబడిదారులకు రూ.5.47 లక్షల కోట్ల లాభం వచ్చింది.

వాస్తవానికి, మార్కెట్ గత చాలా రోజులుగా స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవి చూసింది. పెట్టుబడిదారులు ఒక నెలలో రూ.14 లక్షల కోట్లు కోల్పోయారు. కరోనా కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయం ప్రపంచ మార్కెట్లను వెంటాడుతోంది. భారతదేశం ఇంతకు ముందు అంతర్జాతీయ విమానాలను అనుమతించగా, ఇప్పుడు వాయిదా వేసింది. యూరోపియన్ దేశాలలో రోజు రోజుకి పరిస్థితులు క్షీణిస్తున్నాయి. కానీ, మన దేశీయ స్టాక్ మార్కెట్ ఈ భయాల నుంచి త్వరగానే బయటపడింది. రెండు రోజుల అద్భుతమైన లాభాల తరువాత, పెట్టుబడిదారుల ఆత్మస్థైర్యం పెరిగి బూమ్ కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

(చదవండి: కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకీ షాక్!)

మరిన్ని వార్తలు