అదృష్టమంటే ఇదేనెమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...!

12 Oct, 2021 20:14 IST|Sakshi

స్టాక్ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, షేర్లు... ఇవ్వన్నీ సామాన‍్య జనాలకు అర్థం కాని ఒక క్లిష్టమైన సబ్జెక్ట్‌. ఒక్కసారి వీటిలో ప్రావీణ్యం సాధించాలే గానీ డబ్బులే..డబ్బులు..! స్టాక్‌మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ లో లాభాలు వస్తే రాత్రికి రాత్రే కుబేరుడు అవ్వచు. నష్టాలు వస్తే బికారీ కూడా అవ్వచ్చు. 

నాలుగు రోజుల్లో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
గత నాలుగు రోజుల నుంచి స్టాక్‌మార్కెట్లు పరుగులు పెడుతూనే ఉంది. అక్టోబర్‌ 8 శుక్రవారం రోజన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60 వేల మార్కును దాటి రికార్డులను సృష్టించింది. దీంతో గత నాలుగు రోజుల మార్కెట్ ర్యాలీలో ఈక్విటీ పెట్టుబడిదారులు సుమారు  6,09,840.74 కోట్ల లాభాలను సొంతం చేసుకున్నారు. అక్టోబర్‌ 12న బీఎస్‌ఈ సూచి నాల్గవ సెషన్‌లో 0.25 శాతం పెరిగి 60,284.31 పాయింట్ల వద్ద ముగిసింది.
చదవండి: వారెవ్వా ! వైన్‌తో నడిచే కారు.. యువరాజు కారంటే అంతేమరి!!

బీఎస్‌ఈ ఇండెక్స్‌ గత నాలుగు రోజుల్లో 1094.58 పాయింట్లు పుంజుకుంది.ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ  రూ. 6,09,840.74 కోట్లు పెరిగి రూ. 2,68,30,387.79 కోట్లకు చేరుకుంది. స్టాక్‌ మార్కెట్లు మంగళవారం రోజున బలహీనంగా ప్రారంభమయ్యాయి బలహీనమైన గ్లోబల్ సూచనలతో మార్కెట్లు అస్థిరతను చూశాయి. అయితే, చివరి గంటలో మార్కెట్లు భారీగా లాభాలను గడించాయి. 

ట్రేడింగ్‌ ముగిసే సమయానికి టైటాన్ షేర్లు అత్యధికంగా 5 శాతం మేర  లాభపడింది తరువాత బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు లాభాలను పొందాయి. హెచ్‌సీఎల్‌ టెక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్‌ షేర్లు వెనుకబడ్డాయి.
చదవండి: ముంచుకొస్తున్న సౌర తుఫాన్‌..! అదే జరిగితే అంధకారమే...!

మరిన్ని వార్తలు