జైడస్‌ వెల్‌నెస్‌- ఇప్కా ల్యాబ్స్‌ భలే జోరు

31 Jul, 2020 13:56 IST|Sakshi

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

5 శాతం జంప్‌చేసిన జైడస్‌ వెల్‌నెస్‌

బీమా కంపెనీలు, ఎంఎఫ్‌ల పెట్టుబడులు

8 శాతం దూసుకెళ్లిన ఇప్కా ల్యాబ్స్‌

52 వారాల గరిష్టాన్ని తాకిన ఇప్కా షేరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ జైడస్‌ వెల్‌నెస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోపక్క ఇదే సమయంలో బీమా రంగ కంపెనీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీలో వాటాలను పెంచుకున్న వార్తలతో ఫార్మా రంగ దిగ్గజం ఇప్కా ల్యాబ్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్‌లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

జైడస్‌ వెల్‌నెస్‌ 
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో జైడస్‌ వెల్‌నెస్‌ నికర లాభం 11 శాతం పెరిగి రూ. 89 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 13 శాతం క్షీణించి రూ. 537  కోట్లకు చేరింది. ఇబిటా దాదాపు యథాతథంగా రూ. 122 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జైడస్‌ వెల్‌నెస్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 1640 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1690 వరకూ ఎగసింది. 

ఇప్కా ల్యాబ్స్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో బీమా రంగ కంపెనీల వాటా ఇప్కా ల్యాబ్స్‌లో 2.22 శాతం నుంచి 4.23 శాతానికి పెరిగింది. కంపెనీలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కు 1.82 శాతం, ఎస్‌బీఐ లైఫ్‌కు 1.1 శాతం వాటా ఉంది. ఈ బాటలో ఎంఎఫ్‌లు యాక్సిస్‌ ట్రస్టీ మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ 1.68 శాతం నుంచి 1.9 శాతానికి, ఎల్‌అండ్‌టీ ట్రస్టీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ 2.74 శాతం నుంచి 3.34 శాతానికి ఇప్కా ల్యాబ్స్‌లో వాటా పెంచుకున్నాయి. ఈ నేపథ్యలో  ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇప్కా ల్యాబ్స్‌ షేరు 8 శాతం దూసుకెళ్లి రూ. 188 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1902 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం!

మరిన్ని వార్తలు