ఆ ఫోన్‌ తయారీని నిలిపేస్తోందా, యాపిల్‌ సంచలన నిర్ణయం?

2 Sep, 2022 16:11 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ త్వరలో ఐఫోన్‌ 14 సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌ విడుదలతో ఇతర ఫోన్‌ల ధరలు భారీగా తగ్గనున్నాయి. దీంతో పాటు ఐఫోన్‌ 11 ఫోన్‌ను తయారీని  నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. 

ప్రతి ఏడాది యాపిల్‌ కొత్త సిరీస్‌ ఫోన్‌ విడుదల సమయంలో కొన్ని పాత ఫోన్‌ల తయారీని నిలిపివేస్తుంది. 2021లో ఐఫోన్‌ 13 సిరీస్‌ విడుదల సమయంలో ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ఉత్పత్తిని నిలిపివేసింది. తాజాగా ఐఫోన్‌ 14సిరీస్‌ విడుదలతో మూడేళ్ల క్రితం విడుదలైన ఐఫోన్‌ ఓల్డ్‌ మోడల్‌ ఐఫోన్‌ 11ను డిస్‌ కంటిన్యూ చేయనుంది. 

చెన్నై కేంద్రంగా యాపిల్‌కు చెందిన ఐఫోన్‌ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ తన ప్లాంట్‌లో ఐఫోన్‌ 11ను తయారు చేస్తుండేది. మార్కెట్‌లో విడుదలైన ఫోన్‌ సైతం కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకట్టుంది. ఐఫోన్‌లలో బెస్ట్‌ సెల్లింగ్‌ ఫోన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే ఫోన్‌ మార్కెట్‌లో కనమరుగు కానుంది.  

ఐఫోన్‌ 11ను నిలిపి వేయడం అంటే
ఐఫోన్‌ 11ను నిలిపి వేయడం అంటే.. యాపిల్‌ ఇకపై ఐఫోన్‌ 11 మోడల్‌ను తయారు చేయదని అర్ధం. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి అనేక ఇతర థర్డ్ పార్టీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయొచ్చు. ఆస్టాక్‌ అమ్మకాలు పూర్తయితేనే ఆమోడల్‌ను విక్రయాల‍్ని నిలిపివేసే అవకాశం ఉంది.

టిమ్‌ కుక్‌ కన్ఫాం చేయలేదు
ఐఫోన్‌ 11 తయారీ నిలిపివేత, ధరల తగ్గింపుపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటిపై యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఐఫోన్‌ 11 నిలిపివేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ మోడల్‌ను వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐఫోన్ 11 నిలిపివేసినా మరికొన్ని సంవత్సరాల పాటు అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను యూజర్లు పొందుతారని తెలుస్తోంది.

చదవండి👉 మీ స్మార్ట్‌ ఫోన్‌ 5జీ నెట్‌ వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి!

మరిన్ని వార్తలు