యూజర్లకు షాక్ : ఐఫోన్ 12లో అవి మిస్

14 Oct, 2020 15:40 IST|Sakshi

ఐఫోన్ చార్జర్,  ఇయర్ ఫోన్స్  లేవు

మండిపడుతున్న  నెటిజనులు

సాక్షి, న్యూఢిల్లీ :  టెక్ దిగ్గజం ఆపిల్  ఐఫోన్ ప్రేమికులకు భారీ షాకే ఇచ్చింది. అట్టహాసంగా లాంచ్ చేసిన ఐఫోన్ 12కు సంబంధించి యూజర్లకు  తీవ్ర నిరాశను మిగిల్చింది. హైస్పీడ్, అధునాతన టెక్నాలజీ, 5జీ నెట్ వర్క్  అంటూ పరిచయమైన 24 గంటల్లోనే ఐఫోన్ 12 వివాదంలో పడింది. ఇంతకు విషయం ఏమిటంటే ఖరీదైన ఆపిల్ ఐఫోన్12తో పాటు చార్జర్, ఇయర్ ఫోన్స్ ను సంస్థ మిస్ చేసింది.  దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు సోషల్ మీడియాలో ఆపిల్ సంస్థపై మండిపడుతున్నారు.  (ఆపిల్ దివాలీ గిఫ్ట్ : కళ్లు చెదిరే ఆఫర్)

ఆపిల్ అధికారిక వెబ్ సైట్ లో ఐఫోన్ 12 బాక్స్  లో ఐఫోన్ అడాప్టర్, ఇయర్ ఫోన్స్ ఇవ్వడం లేదంటూ ప్రకటించి కొనుగోలుదారుల ఆశలపై నీళ్లు చల్లింది. 2030 నాటికి “నెట్-జీరో క్లైమేట్ ఇంపాక్ట్” తో ప్రపంచాన్ని తీర్చిదిద్దుతామన్న హామీని నెరవేర్చడానికే ఈనిర్ణయం తీసుకున్నామంటూ చావుకబురు చల్లగా చెప్పింది. దీంతోఎంతోకాలంగా లేటెస్ట్ ఐఫోన్ కోసం ఎదురుచూసిన యూజర్లు ట్విటర్లో విమర్శలు గుప్పిస్తున్నారు.  కిడ్నీ అమ్ముకొని మరీ ఖరీదైన ఐఫోన్ కొనుక్కుంటే.. ఇంత అన్యాయమా అంటూ చమత్కరిస్తున్నారు.  కాగా మొత్తం నాలుగు వేరియంట్లలో విడుదలైన ఐఫోన్ 12  ప్రీ ఆర్డర్లు వచ్చే నెల 6 నుంచి డెలివరీలు 23 నుంచి షురూ కానున్న సంగతి తెలిసిందే. (5జీ ఐఫోన్‌ 12 వచ్చేసింది..)

మరిన్ని వార్తలు