ఐఫోన్ 12, 12 ప్రో  సేల్ షురూ, డిస్కౌంట్స్

30 Oct, 2020 14:28 IST|Sakshi

సాక్షి, ముంబై:  ఆపిల్ కొత్త ఐఫోన్ మోడల్స్ ఇపుడు భారతీయ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల ప్రారంభంలో ఆపిల్ ఆవిష్కరించిన ఐఫోన్ 12 సిరీస్‌ స్మార్ట్ ఫోన్లు   ఐఫోన్ 12,  ఐఫోన్ 12 ప్రో  కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి.  అయితే ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో మాక్స్ అమ్మకాలు నవంబర్ 13 న  మొదలవుతాయి.  (ఆపిల్ రికార్డు సేల్స్ : 80 లక్షల ఐఫోన్లు)

భారతదేశంలో ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో ధర, లభ్యత 
భారతదేశంలో ఐఫోన్ 12 ధర రూ. 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 79,900  రూపాయలు ఉండగా, 128 జీబీ ఆప్షన్ ధర రూ. 84,900, 256 జీబీ మోడల్  ధర రూ. 94,900.  ఐఫోన్ 12 ప్రో   ప్రారంభ 128 జీబీ వేరియంట్‌ 1,19,900 రూపాయలు.  ఐఫోన్ 12 ప్రో 256 జీబీ,  512 జీబీ స్టోరేజ్ వేరియంట్ల ధర వరుసగా రూ. 1,29,900, రూ. 1,49,900గా ఉన్నాయి.  ఐఫోన్ 12,  ఐఫోన్ 12 ప్రో రెండూ దేశంలోని వివిధ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రిటైల్ ఛానెళ్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

ఆఫర్లు

  • ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుచేస్తే  ఐఫోన్ 12 పై 22,000 రూపాయలు,  ఐఫోన్ 12 ప్రోలో 34,000  రూపాయల ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది.  అదేవిధంగా అమెజాన్  కూడా రెండు ఐఫోన్ మోడళ్లపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను  అందించనుంది. 
  • హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ .6,000 తగ్గింపు లభిస్తుండగా డెబిట్ కార్డ్ వినియోగదారులకు రూ .1,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 16 నెలలు  నోకాస్ట్ ఈఎంఐ లభ్యం.
  • ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులపై 5 శాతం తగ్గింపును అందిస్తుండగా, అమెజాన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుదారులకు 5 శాతం తగ్గింపు లభిస్తుంది.

ధరలు
ఐఫోన్ 12 64 జిబి రూ. 79,900
ఐఫోన్ 12 128 జీబీ రూ. 84,900
ఐఫోన్ 12 256 జీబీ రూ. 94,900
ఐఫోన్ 12 ప్రో 128 జీబీ రూ. 1,19,900
ఐఫోన్ 12 ప్రో 256 జీబీ రూ. 1,29,900
ఐఫోన్ 12 ప్రో 512 జీబీ రూ. 1,49,900

 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు