ఐఫోన్‌ లవర్స్‌కు బంఫరాఫర్‌!

26 May, 2022 20:00 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌ 12పై డిస్కౌంట్‌లు ప్రకటించింది. యాపిల్‌కు చెందిన రీటెయిల్ ఔట్‌లెట్‌లలో ఈఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్‌లు పొందవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో  రీటెయిల్ డిస్కౌంట్స్‌, బ్యాంక్‌ ఆఫర్‌, ఎక్ఛేంజ్‌ ఆఫర్‌తో ఐఫోన్‌ 12ను రూ.32వేలకే సొంతం చేసుకోవచ్చు.
 

యాపిల్‌ ప్రీమియం ఫోన్‌లను అమ్మే యూనికార్న్‌ స్టోర్‌ ఐఫోన్‌12ని రూ.32వేలకే అందిస్తుంది. ఫోన్‌ అసలు ధర రూ.56,674 ఉండగా స్టోర్‌ 14శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ.3వేల తగ్గింపు, రూ.3వేల విలువైన ఎక్స్‌ఛేంజ్ బోనస్‌తో కలిపి ధర ఉంటుందని ప్రకటన స్పష్టంగా పేర్కొంది. 

ఐఫోన్‌ 12ను కొనుగోలు కోసం హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ని ఉపయోగిస్తే  రూ.3వేల క్యాష్‌ బ్యాక్‌, పాత ఐఫోన్‌11 లేదా ఐఫోన్‌ ఎక్స్‌ ఆర్‌ను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ కింద రూ.19,000 వరకు పొందవచ్చు. యూనికార్న్‌ స్టోర్‌ రూ.3వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. మీ పాత ఫోన్‌కి రూ.20వేలు పొందగలిగితే  పొందగలిగితే, మీరు దాదాపు రూ.33వేలకే ఐఫోన్‌ 12ని పొందవచ్చు. మీ పాత ఫోన్‌కు మీరు పొందే ధర పూర్తిగా మీ ఫోన్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్‌లో బ్యాటరీ పనితీరు మందగించినా, లేదా స్క్రాచ్‌లు పడినా ఐఫోన్‌ ధర తగ్గుతుంది.   

ఐఫోన్‌ 12ఫీచర్లు 
ఐఫోన్ 12 నెక్ట్స్‌ జనరేషన్ న్యూరల్ ఇంజన్ ప్రాసెసర్‌తో ఏ14 బయోనిక్ చిప్‌తో వస్తుంది. 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ముందు భాగంలో నైట్ మోడ్, 4కే డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌తో రికార్డింగ్‌తో కూడిన 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్‌ ఫ్రంట్ కెమెరా ఉంది. ప్రొటక్షన్‌ కోసం ఐఫోన్ 12 సిరామిక్ షీల్డ్ కోటింగ్‌ను కలిగి ఉంది.

చదవండి👉ఐఫోన్‌13 పై ఆఫర్‌ మామూలుగా లేదుగా,నెలకు రూ.760కే..అస్సలు మిస్‌ చేసుకోవద్దు!

మరిన్ని వార్తలు