ఉల్క శకలాలతో తయారుచేసిన ఈ అరుదైన ఫోన్‌ ఖరీదు ఎంతో తెలుసా..!

24 Jun, 2021 19:23 IST|Sakshi

సాధారణంగా మనం తీసుకున్న స్మార్ట్‌ఫోన్లకు రక్షణ కోసమో, లేదా మరింత అందాన్ని స్మార్ట్‌ఫోన్లకు తీసుకరావడానికి వివిధ రకాల మొబైల్‌ కవర్స్‌తో మన ఫోన్లను ముస్తాబు చేస్తాం. లగ్జరీ వర్షన్‌ స్మార్ట్‌ఫోన్లకు మరింత అందాన్ని తేవడంకోసం కస్టమైజ్‌డ్‌ డిజైన్‌లతో స్మార్ట్‌ ఫోన్‌కు మరింత లూక్‌ వస్తోంది. స్మార్ట్‌ఫోన్లకు కస్టమైజ్‌డ్‌ లూక్‌ను తీసుకురావడంలో, అందంగా మొబైల్‌ కేసులను తయారుచేయడంలో కేవియర్‌ దిట్ట. కాగా తాజాగా కస్టమైజ్‌డ్‌ లూక్‌తో డిజైన్‌ చేసిన  ఐఫోన్‌ ఫస్ట్‌ లూక్‌ను కేవియర్‌ ఆవిష్కరించింది.

ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో ఉల్క శకలాలు, విలువైన లోహాలు, ఖరీదైన స్టోన్లను ఉంచాలని కంపెనీ యోచిస్తోంది. ఈ లగ్జరీ బ్రాండ్ లైనప్‌కు “పరేడ్ ఆఫ్ ది ప్లానెట్స్”గా పేరు పెట్టారు. అంతరిక్ష నౌకలకు వాడే టైటానియం లోహంతో ఐఫోన్ బ్యాక్‌ను కవర్‌ చేయనున్నారు. అంతేకాకుండా డబుల్ గోల్డ్ ప్లేటింగ్‌తో తయారుచేయబడిన గోల్డెన్‌ వెర్షన్ ఫోన్‌ను కూడా లాంచ్‌ చేశారు. 

ఐఫోన్ మోడళ్ల ధర $ 14,290 (సుమారు రూ. 10.60 లక్షలు)నుంచి మొదలవుతుంది. టైటానియంతో చేసిన మోడల్ ధర $ 12,750 (సుమారు రూ. 9.46 లక్షలు) గా కేవియర్ నిర్ణయించింది. ఈ మోడళ్లకు సంబంధించిన వీడియోను కూడా కంపెనీ రిలీజ్‌ చేసింది.

చదవండి: ఆవిష్కరణ: ప్లాస్టిక్‌ అవుతుంది వెనీలా ఫ్లేవర్‌!

మరిన్ని వార్తలు