ఐఫోన్‌- 13 రిలీజ్‌..! విపరీతంగా ట్రోల్‌ చేస్తోన్న నెటిజన్లు..! అందులో జోమాటో కూడా..

15 Sep, 2021 16:14 IST|Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐఫోన్‌-13 సిరీస్‌ ఫోన్లను ఆపిల్‌ మంగళవారం రోజున లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. లాంచ్‌ ఈవెంట్‌లో భాగంగా బాలీవుడ్‌ క్లాసిక్‌ దమ్‌ మారో దమ్‌ సాంగ్‌ను ప్లే చేసింది.   ఐఫోన్‌-13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్‌లను ఆపిల్‌ రిలీజ్‌ చేసింది. ఐఫోన్‌-13 సిరీస్‌ ఫోన్లను సెప్టెంబర్‌-17 నుంచి ప్రీ ఆర్డర్‌ చేసుకోవచ్చునని ఆపిల్‌ పేర్కొంది. సెప్టెంబర్‌ 24 నుంచి ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.  
చదవండి: Apple : సెప్టెంబర్‌ 14నే ఐఫోన్‌-13 రిలీజ్‌..! కారణం​ అదేనా..!

విపరీతంగా ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు...!
తాజాగా  ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లపై కొంత మంది నెటిజన్లు మాత్రం విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఐఫోన్‌-12, ఐఫోన్‌-13 రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదంటూ ట్విటర్‌లో నెటిజన్లు మీమ్సీ షేర్‌ చేస్తున్నారు. నెటిజన్లే కాకుండా ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జోమాటో కూడా ట్విటర్‌లో ఐఫోన్-12, ఐఫోన్‌-13 మోడళ్లపై తన దైన శైలిలో ట్రోల్‌ చేసింది. జోమాటో తన ట్విటర్‌లో  ఐఫోన్‌-13 విషయంలో కెమెరాలను సమాంతరంగా కాకుండా, డయాగోనల్‌గా ఏర్పాటుచేసిందంటూ  ట్విట్‌ చేసింది. 

ట్విటర్‌లో..ఐఫోన్‌-13 లో కేవలం ఒక చిప్‌నే మార్చగా... మిగతా హర్డ్‌వేర్స్‌కు  ‘న్యూ’ జోడించి న్యూ ఎక్స్‌పీరియన్స్‌ పేరిట ఆపిల్‌ లాంచ్‌ చేసినట్లు ఓ నెటిజన్‌ తెలిపాడు. మరో నెటిజన్‌ మీ దగ్గర ఐఫోన్‌-12 ఉండి ఉంటే ఐఫోన్‌-13 మీకు కోసం కాదు అంటూ..ఐఫోన్‌-13 డిజైన్‌ విషయంలో ఫోటోషాప్‌ చేసిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు.
      
భిన్నంగా కన్పించపోయినా..
ఐఫోన్ 12తో ఐఫోన్‌-13 భిన్నంగా కనిపించకపోయినా, ఐఫోన్ 13 లోపల వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన బ్యాటరీ జీవితం, కొత్త కెమెరా , వీడియో రికార్డింగ్ మోడ్‌లతో సహా అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉందని ఆపిల్‌ తన లాంచ్‌ ఈవెంట్‌ పేర్కొంది.భారత్‌లో ఐఫోన్ 13 మినీ 128జీబీ మోడల్ ధర రూ. 69,900. 256జీబీ మోడల్ రూ .79,900 , 512జీబీ మోడల్ రూ .99,900 లకు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 13 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .79,900, 256జీబీ ధర రూ .89,900 , 512జీబీ మోడల్  ధర రూ. 109,900 గా ఉండనుంది. 

చదవండి: iPhone: భారీగా తగ్గిన ధరలు, ఐఫోన్‌ లవర్స్‌కు శుభవార్త!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు