Apple: ఆపిల్‌ కొంపముంచిన చిప్స్‌...!

13 Oct, 2021 17:20 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్స్‌(చిప్‌) కొరత పలు కంపెనీలను తీవ్రంగా వేధిస్తోంది. చిప్స్‌ కొరతతో పలు ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. తాజాగా చిప్స్‌ కొరత ఆపిల్‌ను కూడా వేధిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆపిల్‌కు భారీ దెబ్బ...!
గత నెలలో ఆపిల్‌ ఐఫోన్‌13 స్మార్ట్‌ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.కాగా ఇప్పుడు సెమికండక్టర్‌ కొరత ఐఫోన్‌13 స్మార్ట్‌ఫోన్ల తయారీపై పడనుంది. దీంతో ఆపిల్‌కు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. చిప్‌ కొరతతో సుమారు 10 మిలియన్ల ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లపై తయారీ భారీ ప్రభావం పడనుంది. ఈ ఏడాది చివరినాటికి సుమారు 90 మిలియన్ల ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ఉత్పతి​ చేయాలని ఆపిల్‌ భావించింది. ఆపిల్‌ చిప్స్‌ను అందిస్తోన్నబ్రాడ్‌కామ్‌, టెక్సాస్‌ ఇన్‌స్ట్రూమెంట్స్‌ చిప్‌ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి.దీంతో ఐఫోన్‌13 స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తిపై భారీ ప్రభావమే చూపనున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది.
చదవండి:  సౌరవ్‌ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..!      

ఇతర స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలతో పోలిస్తే బెటర్‌...!
ఇతర స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలతో పోలిస్తే ఆపిల్‌పై చిప్స్‌ కొరత ప్రభావం తక్కువగా ఉన్నట్లు ఆపిల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా, తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో కరోనా కారణంగా టెక్‌ దిగ్గజం ఆపిల్‌తో సహా ఇతర టెక్‌ కంపెనీలకు అందించే ఫోన్‌ విడి భాగాల(కాంపోనెంట్స్‌)పై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఊహించిన దానికంటే చిప్‌ సెట్ల కొరత చాలా ఎక్కువ ఉందని  పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు.
చదవండి: భారత్‌ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు..!

>
మరిన్ని వార్తలు